IndiGo: విమానాల్లో కొబ్బరికాయను తీసుకెళ్లవచ్చా? నిషేధం ఉంటుందా?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక మహిళ చేసిన పోస్ట్‌కి స్పందిస్తూ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎండిన కొబ్బరికాయకు చెక్ ఇన్ లగేజీలో అనుమతి ఉండబోదని తెలిపింది.

IndiGo: విమానాల్లో కొబ్బరికాయను తీసుకెళ్లవచ్చా? నిషేధం ఉంటుందా?

Coconut

Updated On : August 20, 2025 / 8:10 PM IST

విమానాల్లో ప్రయాణించడమంటే ఆషామాషీ కాదు. కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. విమానంలో మొదటిసారి ప్రయాణించేవారు తికమకపడడం సహజమే. తమతో పాటు తీసుకెళ్తున్న బ్యాగుల్లో ఏమి పెట్టుకోవచ్చు, ఏమి పెట్టకూడదు? అని చాలా మందికి తెలియదు.

చాలామందికి 100 ఎంఎల్‌కు పైగా ఉండే ద్రవాలు, పదునైన వస్తువులు, ఏరోసాల్స్ (వాయువుగా మారే ద్రవం) నిషేధం అన్న విషయాలు తెలుసు. కానీ, కొబ్బరికాయ వంటి కొన్ని వస్తువులను కూడా అనుమతించబోరని చాలా మందికి తెలియదు.

Also Read:  కర్నూలు జిల్లాలో నీటికుంటలో మునిగిన 5వ తరగతి విద్యార్థులు.. ఆరుగురి మృతి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక మహిళ కొబ్బరికాయలను విమానాల్లో ఎందుకు తీసుకెళ్లనివ్వబోరని చేసిన పోస్ట్‌కి స్పందిస్తూ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎండిన కొబ్బరికాయ అత్యంత దహనశీల వస్తువని, అందుకే దానికి చెక్ ఇన్ లగేజీలో అనుమతి ఉండబోదని తెలిపింది.

ఎండిన కొబ్బరికాయకు హ్యాండ్ బ్యాగేజీలోనూ, చెక్‌డ్ బ్యాగేజీలోనూ అనుమతి లేదని ఇండిగో చెప్పింది. ఎండిన కొబ్బరికాయలో నూనె ఎక్కువగా ఉంటుందని, దాంతో కొబ్బరి నూనె తయారు చేస్తారని, అది అత్యంత దహనశీలమని వివరించింది. విమానంలో వేడి తగిలితే మంటలు అంటుకోవచ్చని చెప్పింది.

కొబ్బరికాయ విషయంలో చెక్ ఇన్ లగేజీకి కఠినమైన నియమాలు ఉన్నాయి. అయితే, స్పైస్‌జెట్ వంటి ఎయిర్‌లైన్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కోసి చెక్‌డ్ బ్యాగేజీలో పెడితే అనుమతి ఉంటుంది. అప్పటికీ బాగా ప్యాక్ చేయాలి. అంటే పచ్చి కొబ్బరికాయ ముక్కలు చెక్ ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లవచ్చు, కానీ పూర్తి లేదా ఎండిన కొబ్బరికాయలకు అనుమతి ఉండదు.