Crime News: 25 ఏళ్ల మహిళా టీచర్‌ను ప్రేమించిన 12వ తరగతి విద్యార్థి.. చివరకు ఆమెపై పెట్రోల్‌పోసి తగలబెట్టి..

టీచర్‌ను ఆ విద్యార్థి చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆమె కుటుంబం చెప్పిందని పోలీసులు అన్నారు.

Crime News: 25 ఏళ్ల మహిళా టీచర్‌ను ప్రేమించిన 12వ తరగతి విద్యార్థి.. చివరకు ఆమెపై పెట్రోల్‌పోసి తగలబెట్టి..

Crime News

Updated On : August 20, 2025 / 2:56 PM IST

Crime News: గురువులు అంటే దేవతలతో సమానం అని భావిస్తాం. అటువంటిది మహిళా టీచర్‌ను వన్‌సైడ్‌ లవ్‌ చేసి, చివరకు చోటుచేసుకున్న పరిణామాలతో ఆమెను తగలబెట్టాడు ఓ విద్యార్థి. మధ్యప్రదేశ్ నర్సింగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్‌ను ఆ విద్యార్థి చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆమె కుటుంబం చెప్పింది.

ఆ మహిళ జిల్లా ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తోంది. అక్కడే చదివిన విద్యార్థి సూర్యాంశ్ కోచర్‌ను తప్పుడు పనులు చేయడంతో రెండు సంవత్సరాల క్రితం దాని నుంచి బహిష్కరించారు.

అనంతరం అతడు కల్యాణ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువు కొనసాగించాడు. అయినప్పటికీ తరచూ తన పాత పాఠశాలకు వచ్చేవాడు.

టీచర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు

ఆగస్టు 15న అతడు ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వచ్చి ఆ టీచర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. (Crime News)

“టీచర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌కి ఫిర్యాదు చేసింది” అని నర్సింగ్‌పూర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ భూరియా తెలిపారు.

సోమవారం కోచర్ టీచర్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలనుకున్నట్టు బయటకు రావాలని కోరాడు. ఆమె బయటకు రాగానే పెట్రోలు పోసి నిప్పంటించాడు. టీచర్ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఓపెన్ డ్రైన్‌లోకి దూకిందని పోలీసులు తెలిపారు.

అనంతరం కోచర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని పోలీసులు మంగళవారం కల్యాణ్‌పూర్ గ్రామంలో అరెస్ట్ చేశారు.

గాయపడ్డ టీచర్‌ను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత అక్కడి నుంచి జబల్పూర్ మెడికల్ కాలేజీకి పంపించారు. ఆమెకు 25% కాలిన గాయాలు అయ్యాయి. విద్యార్థిపై హత్యాయత్నం కేసు పెట్టారు.

స్కూల్ ప్రిన్సిపల్ జి.ఎస్. పటేల్ మాట్లాడుతూ.. “సూర్యాంశ్ మా స్కూల్‌లో చదివాడు… ఎన్నిసార్లు హెచ్చరించినా మారలేదు, అందుకే స్కూల్ నుంచి అప్పట్లో బహిష్కరించాం” అని చెప్పారు.

టీచర్‌ను ఆ విద్యార్థి చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆమె కుటుంబం చెప్పిందని పోలీసులు అన్నారు.