West Bengal : నాడు పనిమనిషి.. నేడు కీలక శాఖకు సహాయ మంత్రి.. పశ్చిమ బెంగాల్‌లో మంత్రులకు శాఖలు కేటాయింపు..
West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం సువేందు అధికారితోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వారికి శాఖలు కేటాయించారు.
- Harish Thanniru
- Updated on- June 10, 2026 / 06:45 PM IST
Kalita Majhi
West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా సువేందు అధికారితోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వారికి శాఖలు కేటాయించారు. సీఎం సువేందు అధికారి హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. గతంలో ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం గడిపి.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కలిత మాఝీకి గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
Also Read : AP Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. ఈ జాగ్రత్తలు పాటించాలి..
పలు ఇళ్లలో పనిచేస్తూ జీవనోపాధి సాగించిన కలితా మాఝీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిచారు. ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,523 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలిత మాఝీ 2026లో ఒక ప్లంబర్ ను వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే వారి కుటుంబం గడిచే పరిస్థితి. దీంతో ఆమె తన కుటుంబాన్ని పోషించేందుకు పలు ఇండ్లలో పనిమనిషిగా పనిచేశారు. ఇండ్లలో పనిచేసుకుంటూనే బీజేపీ ర్యాలీలకు హాజరవుతూ వచ్చారు. గతంలో ఓటమి పాలైన ఆమె.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు.. మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. తాజాగా.. ఆమెకు సీఎం సువేందు అధికారి కీలక శాఖకు సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన స్వపన్ దాస్‌గుప్తాకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.
మంత్రులు- వారి శాఖలు
♦ తపస్ రాయ్- పరిశ్రమలు, వాణిజ్య శాఖ
♦ దిలీప్ ఘోష్- పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ
♦ అగ్నిమిత్ర పాల్- పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల శాఖ
♦ డాక్టర్ శరద్వత్ ముఖర్జీ- ఆరోగ్య శాఖ
♦ జగన్నాథ్ ఛటోపాధ్యాయ- ఉన్నత విద్యాశాఖ
♦ దూద్ కుమార్ మండల్- వ్యవసాయ శాఖ
♦ దీపక్ బర్మన్- పాఠశాల విద్యాశాఖ
♦ శంకర్ ఘోష్- పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు
♦ అర్జున్ సింగ్- కార్మిక, రవాణా శాఖ
♦ ఇంద్రనీల్ ఖాన్ -క్రీడలు, యువజన, వినియోగదారుల వ్యవహారాల శాఖ
♦ మాలతీ రావ రాయ్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ
