Karnataka : యువతిని పరుగెత్తించి.. కత్తితో దాడిచేసి హత్య.. పట్టపగలే బస్టాండ్‌లో దారుణ ఘటన.. వీడియో వైరల్..
Bantwal Bus Stand Murder : కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే బస్టాండ్ ప్రాంతంలో ఓ యువకుడు యువతిని పరుగెత్తించి కత్తితో దాడిచేసి హత్యచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Harish Thanniru
- Published on- July 17, 2026 / 05:27 PM IST
Lavanya Murder Case in Karnataka
- కర్ణాటకలో దారుణ ఘటన
- యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
Bantwal Bus Stand Murder : కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ ప్రాంతంలో ఓ యువకుడు యువతిని పరుగెత్తించి కత్తితో దాడిచేసి హత్యచేశాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లోని బీసీ రోడ్ కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ దారుణ ఘటన సంచలనం సృష్టించింది.
Also Read : Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు.. హైదరాబాద్‌లో దారుణం
ఈ దారుణ ఘటనలో మృతురాలు లావణ్య (21)గా పోలీసులు గుర్తించారు. ఆమె కక్కేపదపు ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆ యువతి పనిచేస్తుంది. విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ఈ సమయంలో ఆమెకు దూరపు బంధువైన చేతన్ (22) అనే యువకుడు ఆ యువతిని ఫాలో అయ్యాడు. కొద్దిరోజుల ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నా అంటూ యువకుడు ఆ యువతిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆ యువతిని ఫాలో అవుతూ బస్సులోకి ఎక్కినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Lavanya and Chetan
బస్సులో తన పక్కన ఓ యువకుడు కూర్చున్నాడని లావణ్య ఫోన్‌లో బంధువులకు చెప్పినట్లు సమాచారం. అనంతరం చేతన్ తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని బయటకు తీయడంతో ఆమె ప్రాణభయంతో బస్సు నుంచి దిగిపోయి పరుగెత్తింది. అయితే నిందితుడు ఆ యువతిని వెంటాడి దాడి చేశాడు. తన చేతిలోని ఆయుధంతో యువతి తలపై పలుసార్లు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో కిందపడిపోయిన ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళూరు సమీపంలోని వామన్‌జూర్‌లోని పచ్చనడి వద్ద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు అతను విషం సేవించినట్లు ఆరోపణలు రావడంతో వైద్య పరీక్షలకోసం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
