Gaming Addiction Murder: దేవుడా ఎంత ఘోరం.. గేమ్స్ ఆడొద్దన్నందుకు ఫ్యామిలీపై కత్తితో దాడి.. ఇద్దరు మృతి
నిరంతరం గేమ్(Gaming Addiction Murder)లు ఆడొద్దని, చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడమే ఆ కుటుంబం పాలిట శాపమైంది.
- V Santhosh Kumar
- Published on- June 8, 2026 / 01:14 PM IST
karnataka minor boy kills father sister over online gaming addiction
- గేమ్స్ వద్దన్నందుకు కన్నవారిపై దాడి.
- తండ్రి, అక్క అక్కడికక్కడే మృతి.
- గేమింగ్ వ్యసనంతో ఘోరం
Gaming Addiction Murder: ఆన్‌లైన్ గేమ్స్‌కు యువత ఎంతలా బానిసలవుతున్నారో చెప్పేందుకు కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో జరిగిన ఘటనే నిదర్శనం. నిరంతరం గేమ్‌లు ఆడొద్దని, చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడమే ఆ కుటుంబం పాలిట శాపమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన 16 ఏళ్ల మైనర్ బాలుడు విచక్షణ కోల్పోయి కన్నవారు, అక్కపై కత్తితో దారుణంగా దాడి చేశాడు(Gaming Addiction Murder). అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘోర రక్తపాతంలో తండ్రి వెంకట నాయుడు(48), అక్క ప్రగతి(20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లి సౌజన్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మరణంతో పోరాడుతోంది.
ఈ దారుణానికి ప్రధాన కారణం ‘గేమింగ్ డిజార్డర్’ (Gaming Disorder) లేదా ఆన్‌లైన్ ఆటల వ్యసనం. మానసిక వైద్య నిపుణుల ప్రకారం, డిజిటల్ స్క్రీన్లకు విపరీతంగా అడిక్ట్ అయినప్పుడు మెదడులో డోపమైన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, ఆటలకు అడ్డుచెప్పిన వారిపై తీవ్రమైన కోపం, హింసాత్మక ప్రవృత్తి, విచక్షణారహిత ప్రవర్తన పెరుగుతాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంస్కారవంతమైన కౌన్సిలింగ్, స్క్రీన్ టైమ్ నియంత్రణ లేకపోతే ఆన్‌లైన్ వ్యామోహం ఎలాంటి ఘోరాలకు దారితీస్తుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది.
