గుళ్లలో గంజాయి ప్రసాదం, దమ్ము కొట్టాలి

  • Publish Date - September 10, 2020 / 05:58 AM IST

Karnataka temples : గుళ్లలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదం ఏంటీ ? పులిహోర, దద్దోజనం, శోండెలు, లడ్డూలు, వడలు, ఇలా కొన్నింటిని ప్రసాదంగా భక్తులకు ఇస్తుంటారు కదా..కానీ..అక్కడి గుళ్లలో మాత్రం గంజాయిని ప్రసాదంగా ఇస్తుంటారు. దమ్ముతో మత్తులోకి తీసుకెళుతారు.




శరణ, శప్త, అరుద, అవధూత సంప్రాదాయాలకు చెందిన వాళ్లు ఈ గంజాయిని రకరకాల రూపాల్లో తీసుకెళుతుంటారు. యాద్గిర్ జిల్లా తింథిని మౌనేశ్వర గుడి దగ్గర ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాతర జరుగుతుంటుంది. చిన్న చిన్న పొట్లాలలో గంజాయిని పెట్టి భక్తులకు బహరంగంగానే ఇస్తుంటారు.
https://10tv.in/pawan-kalyan-fans-fires-on-actress-madhavi-latha/



మనప్ప దేవుడిని దర్శించుకున్న తర్వాత..గంజాయని సేవించాల్సి ఉంటుంది. ప్రసాదం తీసుకోవడం వల్ల మరంత బుద్ధి, దేవుడి పట్ల ఓ అవగాహన పెంచుతుందన ఇక్కడి వారి విశ్వాసం. కొందరు దీనిన పొగాకు పొడిగా వాడుతుంటారు. మరికొందరు నీళ్లలో మరగపెట్ట తాగుతుంటారు. ఇందులో రహస్యం ఏముంది ? మనిషి ఒత్తిళ్ల నుంచి దూరం చేయడానికి, రిలాక్స్ అవడానికి ఇది ఉపయోగపడుతుందని మనప్ప గుడి కమటీ మెంబర్ గంగాధర నాయక్ అంటున్నాడు.




లోతుగా ధాన్యం చేసేందుకు సహకరిస్తుందని యాద్గిర్ జల్లా, సిద్దవట దామ శివయోగి ఆశ్రమ వాసి అంటున్నాడు. తమ తమస్సు సమయంలో యోగులు గంజాయి తీసుకోవడం సహజమే వెల్లడిస్తున్నాడు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.




ప్రస్తుతం గంజాయి వాడకం భారతదేశంలో నిషేధించబడిన సంగతి తెలిసిందే. అక్రమమార్గంలో వీటిన తరలిస్తుంటారు. డ్రగ్స్ ను కూడా ఇలాగే తరలిస్తున్నారు
అక్రమమార్కులు. దీనిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు