Karnataka: పాఠశాలల్లో వీర సావర్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేసిన దేశంలోని ప్రముఖుల ఏడు ఫొటోలలో వీర్ సావర్కర్ ఫోటో ఒకటి.

Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలల్లో వీర సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయనుంది అక్కడి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో సావర్కర్ పేరుతో అధికార పార్టీకి విపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతే కాకుండా అసెంబ్లీలో సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయడంపై సోమవారం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సావర్కర్ ఫొటో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Elon Musk: మస్క్‭కు వ్యతిరేకంగా మిలియన్ల ఓట్లు.. ఇంకెప్పుడు తప్పుకుంటావంటూ మండిపడుతున్న నెటిజెన్లు

విద్యార్థులకు ఆదర్శంగా ఉండేందుకు పాఠశాలల్లో స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలు ఏర్పాటు చేయాలని, అందులో భాగంగానే స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ చిత్ర పటాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. సునిల్ కుమార్ మంగళవారం తెలిపారు. సువర్ణ సౌధలోని అసెంబ్లీ హాలులో సావర్కర్ చత్రపటం పెట్టడాన్ని మంత్రి సునీల్ సమర్థించారు.

Nakul Nath: భారత్ జోడో యాత్ర కంటే నా ర్యాలీలే పవర్‭ఫుల్.. కాంగ్రెస్ యువనేత ఆసక్తికర వ్యాఖ్యలు

నిరసన అనంతరం, సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేసిన దేశంలోని ప్రముఖుల ఏడు ఫొటోలలో వీర్ సావర్కర్ ఫోటో ఒకటి. కాంగ్రెస్‌ నాయకులు, శాసనసభ్యుల గైర్హాజరీలో వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా, వీర్ సావర్కర్ ఫోటోను ఏర్పాటు చేయడంపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు