Nakul Nath: భారత్ జోడో యాత్ర కంటే నా ర్యాలీలే పవర్‭ఫుల్.. కాంగ్రెస్ యువనేత ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తను చేస్తున్న ర్యాలీలే శక్తివంతంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‭నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కొద్ది రోజుల క్రితమే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి చేసుకుంది. అనంతరం నకుల్ ర్యాలీలు చేపట్టారు.

Nakul Nath: భారత్ జోడో యాత్ర కంటే నా ర్యాలీలే పవర్‭ఫుల్.. కాంగ్రెస్ యువనేత ఆసక్తికర వ్యాఖ్యలు

My rallies more popular than Bharat Jodo Yatra says Congress Kamal Nath’s son

Updated On : December 20, 2022 / 5:08 PM IST

Nakul Nath: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తను చేస్తున్న ర్యాలీలే శక్తివంతంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‭నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కొద్ది రోజుల క్రితమే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి చేసుకుంది. అనంతరం నకుల్ ర్యాలీలు చేపట్టారు. అయితే ఒక ర్యాలీలో నకుల్ ప్రసంగిస్తూ.. రాహుల్ గాంధీ ర్యాలీలకు వచ్చిన ప్రజలకంటే ఎక్కువ తన ర్యాలీలోనే కనిపిస్తున్నారని అన్నారు.

Kharge Dog Remark: ‘బీజేపీ కక్కను కూడా..’ అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. దద్దరిల్లిన పెద్దల సభ

‘‘నేను రాహుల్ గాంధీ వెంట మధ్యప్రదేశ్ మొత్తం తిరిగాను. కానీ ఈరోజు బెరాసియా ప్రజలకు నేనొక విషయం చెప్పదల్చుకున్నాను. భారత్ జోడో యాత్రలో కంటే ఎక్కువ జనం నాకు ఇక్కడే కనిపిస్తున్నారు’’ అని నకుల్ అన్నారు. ఇక ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోకపోతే, ఇక విపక్షాలు ఎలా పట్టించుకుంటాయి? ప్రజలు ఇంకేం పట్టించుకుంటారు? అంటూ సెటైర్లు విసురుతున్నారు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

కమల్ నాథ్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నకుల్ నాథ్.. చంద్వాడ లోక్‭సభ నియోజకవర్గం నుంచి గెలుపొంది పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. రెండు వారాల క్రితమే రాహుల్ గాంధీతో నకుల్ పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో కమల్ నాథ్ సైతం పాల్గొన్నారు.