×
Ad

Toll Plaza : వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులకు ఇక చెక్.. కానీ, ఈ నిబంధనలు పాటించాలి..

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం టోల్‌ వసూళ్ల విషయంలో సులభతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగ్గా ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది.

Toll Plaza

  • వాహనదారులకు బిగ్ అలర్ట్
  • ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్ల వద్ద నో క్యాష్
  • టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జాంల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

Toll Plaza : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇకపై టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి నగదు తీసుకునే క్యాష్ లైన్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాహనదారులు ఇక నుంచి కేవలం ఫాస్టాగ్, యూపీఐ యాప్ ల ద్వారానే తమ టోల్ ఛార్జీలను పే చేయాల్సి ఉంటుంది. హైవేలపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రయాణం వేగంగా, సాఫీగా సాగేలా చూసేందుకే క్యాష్ పేమెంట్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read : China : చైనా ఇంజనీర్ల మరో అద్భుత ఆవిష్కరణ.. 2 గంటల ప్రయాణం.. 20 నిమిషాల్లో..!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు వెహికల్‌కు ఉన్న ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద డబ్బులు చెల్లిస్తుంటారు. అదే, ఫాస్టాగ్ లేని వారు లేదా పని చేయని వారు యూపీఐ ద్వారా మనీ పే చేస్తుంటారు. ఈ అవకాశం కూడా లేనివారు క్యాష్ రూపంలో టోల్ రుసుము కడుతుంటారు. ఇక్కడే సమస్య వస్తోంది. నగదు చెల్లింపుల కారణంగా చాలా సమయం వృథా అవుతోంది. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశశ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

వాహనదారులు ఈ విషయాలు గుర్తించుకోవాలి..
♦ జాతీయ రహదారులపై ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
♦ వాహనదారులు ఇప్పటి వరకు ఉన్న ఫాస్టాగ్ ను అప్‌డేట్ చేసుకోవాలి.
♦ ఫాస్టాగ్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
♦ ఇంటి నుంచి బయలుదేరే ముందు ఫాస్టాగ్ వాలెట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి.
♦ ఒకవేళ తగినంత నగదు లేకపోతే రీఛార్జి చేసుకోవాలి.
♦ ఒకవేళ ఫాస్టాగ్ ఉన్నా ఏదైనా అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటానికి యూపీఐ ద్వారా చెల్లింపు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..
♦ యాప్ ద్వారా ఈజీగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ లో గూగుల్ ప్లే స్టోర్ లో మైఫాస్టాంగ్ యాప్ డౌన్లోడ్ చేసి సింపుగా ఫాస్టాగ్ అమౌంట్ తెలుసుకోవచ్చు.
♦ ఈ యాప్ లో ఫాస్టాగ్ అకౌంట్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీ ఫాస్టాగ్ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.
♦ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ను మిస్డ్ కాల్ ద్వారా కూడా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్రీపెయిడ్ వాలెట్ కు మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 88843 33331 కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఫోన్లో ప్రస్తుత ఫాస్టాగ్ బ్యాలెన్స్ చూపిస్తూ మెసేజ్ వస్తుంది.