Sugar Price
Sugar Price: కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆహారం కొరత ఏర్పడింది. ఉత్తర కొరియాలో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. అరటి పండ్లు డజను రూ. 3000 వేల ధర పలుకుతున్నాయి. పాల ప్యాకెట్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక పాకిస్థాన్ లో కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ తో వాణిజ్యం నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకునే కూరగాయలు, చక్కర, బెల్లం వంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో చక్కర రూ.110 పలుకుతుంది. ఇక మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
గతంలో దిగుమతి చేసుకున్న చక్కర నిల్వలు నిండుకోవడంతో విపరీతమైన చక్కర కొరత ఏర్పడింది. ఇక రంజాన్ సమయంలో గోధుమ పిండి ధర 96 కు పెరిగింది. ఇక పరస్పర వాణిజ్యం విషయంలో భారతదేశం ఎప్పుడు పైచేయి సాధిస్తుంది. 2018-19లో భారతదేశం 550.33 మిలియన్ డాలర్ల విలువైన పత్తిని, 457.75 మిలియన్ డాలర్ల విలువైన సేంద్రియ రసాయనాలను ఎగుమతి చేసింది.