MS Dhoni : బుడ్డోడి హెలికాప్టర్ షాట్, నెటిజన్లు ఫిదా
- madhu
- Published On : June 5, 2021 / 09:35 AM IST
Dhoni
MS Dhoni Helicopter Shot : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. అతని బ్యాటింగ్ ఎప్పుడు షురూ అవుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. హెలికాప్టర్ షాట్ కొట్టడం ధోని ప్రత్యేక స్టైల్. ఈ షాట్ ఆడాలని చాలా మంది క్రికేటర్లు ప్రయత్నించి విఫలం చెందుతుంటారు. కొంతమంది క్రీడాకారులు మాత్రం సక్సెస్ అయ్యారు. హెలికాప్టర్ షాట్ చాలా కేర్ ఫుల్ గా ఆడాల్సి ఉంటుంది. లేకపోతే..బ్యాట్స్ మెన్ అవుట్ కావడం..లేదా..గాయాలపాలు కావాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంచితే..ఓ బుడ్డోడి హెలికాప్టర్ షాట్ కు అందరూ ఫిదా అవుతున్నారు. భారత మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన బంతిని కళ్లు చెదిరే విధంగా హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఇతని షాట్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని షాట్ కు నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.
Read More : Hospital Scam: డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఆస్పత్రి.. ఆరోగ్యశ్రీలో వైద్యం చేసి కూడా..!
नन्हा कलाकार #AakashVani pic.twitter.com/26D9Wk63D2
— Wear a Mask. Stay Safe, India (@cricketaakash) June 4, 2021
