Hospital Scam: డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఆస్పత్రి.. ఆరోగ్యశ్రీలో వైద్యం చేసి కూడా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాధికి ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తున్నా కూడా కొన్ని ఆస్పత్రులు రోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తూ.. మళ్ళీ ఆరోగ్యశ్రీలో డబ్బులు తీసుకుంటున్నాయి.

Hospital Scam: డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఆస్పత్రి.. ఆరోగ్యశ్రీలో వైద్యం చేసి కూడా..!

Inma

Kakinada-based Inodaya Hospital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాధికి ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తున్నా కూడా కొన్ని ఆస్పత్రులు రోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తూ.. మళ్ళీ ఆరోగ్యశ్రీలో డబ్బులు తీసుకుంటున్నాయి. అంతేకాదు.. లక్షల్లో డబ్బులు వసూలు చెయ్యడమే కాదు. డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కాకినాడలో ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేసి కూడా.. రోగి బంధువుల నుంచి లక్షల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం చెందింది.

రోగి నుంచి వసూలు చేసిన నాలుగన్నర లక్షల రూపాయలను ఆసుపత్రి యాజమాన్యం బాధితుని బంధువులకు అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేసి కూడా.. వారి బంధువుల నుంచి అక్రమంగా 4లక్షల 50వేల రూపాయలను వసూలు చేసింది. అంతేకాదు.. మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది.

దీంతో బాధితులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి 22లక్షల 50వేల రూపాయల పెనాల్టీ వేశారు.