ఆఫీసులోనే సరసాలు, మహిళా ఉద్యోగికి ముద్దు పెట్టిన తహసీల్దార్

  • Publish Date - August 27, 2020 / 12:19 PM IST

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉన్నతాధికారి దారితప్పాడు. ఏకంగా ఆఫీసులోనే సరసాలకు దిగాడు. ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో తహసీల్దార్‌ గా పని చేస్తున్న గురుబసవరాజు ఈ పని చేశాడు.



రెండు నెలల క్రితం అతడు కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెట్టాడు. దానికి సంబంధించి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తహసీల్దార్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. సహచర ఉద్యోగులు దీనిపై మండిపడుతున్నారు. ఛీఛీ.. ఇదేం పాడుపని అని తిడుతున్నారు. ముద్దు వీడియో వైరల్ గా మారింది. ఆఫీసులోనే సరసాలు ఆడిన సదురు తహసీల్దార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.