ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలి: రామ్‌నాథ్‌ కోవింద్‌

  • Publish Date - October 8, 2019 / 06:32 AM IST

దసరా పండుగ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలిచిన రోజు దసరా. నిజయతీకి, స్ఫూర్తికి దసరా చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని తెలిపారు.

అంతేకాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ సందర్భంగా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగ జరుపుకోవాలని తెలిపారు.

ఇంకా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దసరా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలనీ, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.