×
Ad

గ‌డ్డ క‌ట్టిన మంచుపై కవాతు చేస్తూ..మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన జవాన్లు

  • Published On : January 26, 2021 / 12:01 PM IST

Ladakh : ITBP  jawans with national flag on a frozen water body : దేశ వ్యాప్తంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో త్రివర్ణ పతకం రెపరెపలాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేసి జెండా గీతాన్ని ఆలపించారు.

ఈ క్రమంలో గడ్డకట్టిన మంచుపై భారత జవాన్లు మువ్వన్నెల జెండాతో కవాతు చేశారు. అనంతరం జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. మా ప్రాణాల్ని సైతం పణ్ణంగా పెట్టి దేశాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ల‌డ‌ఖ్‌లో గ‌డ్డ క‌ట్టిన మంచుపై ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసు(ఐటీబీపీ) జ‌వాన్లు రిప‌బ్లిక్ డే వేడుకలు నిర్వ‌హించారు.

జాతీయ జెండా చేత‌బూని గ‌డ్డ కట్టిన మంచుపై న‌డిచి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. ల‌డ‌ఖ్‌లోని అత్యంత ఎత్తైన ఔట్‌పోస్టు వ‌ద్ద మంచుకొండ‌ల మ‌ధ్య మువ్వ‌న్నెల జెండాను ఎగుర‌వేసి సెల్యూట్ చేశారు.