Lalit Modi : మాజీ IPL బాస్ లలిత్ మోదీ సంచలన నిర్ణయం.. ‘ఇక ఆ అధ్యాయం ముగిసింది’.. భారత్‌కు వస్తున్నా.. వీడియో విడుదల

Lalit Modi : ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ తిరిగి భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

Lalit Modi

Lalit Modi : ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ తిరిగి భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ ఊరటనిచ్చింది. ఈ తీర్పు అనంతరం ఆయన వీడియోను విడుదల చేసిన ఆయన.. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశానికి రావాలనుకుంటున్నానని తెలిపారు. 16ఏళ్లుగా సాగిన న్యాయపోరాటానికి ట్రెబ్యూనల్ తీర్పు ముగింపు పలికిందని అన్నారు.

Also Read : Schools Closed : విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 24న స్కూళ్లు, కాలేజీలు బంద్.. కారణం ఇదే..

ఫెమా కేసు నమోదు కావడంతో 2010 నుంచి లలిత్ మోడీ భారత దేశాన్ని విడిచి విదేశాల్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ కేసులో ఆయనకు అప్పిలేట్ ట్రైబ్యూనల్ ఊరటనిచ్చింది. తాజా తీర్పు పట్ల సంతోషంగా ఉందన్న లలిత్ మోడీ.. నిజంగా ఇది ఒక గొప్ప రోజు అంటూ పేర్కొన్నాడు. గత పదహారేళ్లుగా మీడియాకు, అందరికీ నేను చెబుతూ వచ్చిన విషయాలే చివరికి నిజమని తేలాయని అన్నారు. ఐపీఎల్ టోర్నీ అంటే నాకెంతో ఇష్టం. ఐపీఎల్ విజయవంతం కావడం గురించి మాత్రమే నేను ఆలోచించానని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఆ అధ్యాయం ముగిసింది. నేను నా జీవితంలో ముందుకు సాగబోతున్నాను. భారత దేశం తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నాను. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు వస్తా. అక్టోబర్‌లో నా కుమార్తె బిడ్డకు జన్మనివ్వనుంది. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ లలిత్ మోదీ పేర్కొన్నారు.

2009లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించిన సమయంలో విదేశీ నిధుల బదిలీలపై ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. లలిత్‌ మోదీతోపాటు మరికొందరిపై ఈడీ కేసులు నమోదు చేసింది. లలిత్‌ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. దీర్ఘకాలంగా సాగిన న్యాయపోరాటానికి ట్రైబ్యునల్ తాజా తీర్పు కీలక మలుపు తీసుకొచ్చింది.