Uttar Pradesh : బైక్‌పై వచ్చి న్యాయవాదిపై కాల్పులు.. నిందితులు పారిపోయే క్రమంలో బిగ్ ట్విస్ట్.. చివరకు మళ్లీ.. వీడియో వైరల్..

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపేశారు.

Uttar Pradesh

  • ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దారుణ ఘటన
  • లాయర్ పై తుపాకీతో దుండగులు కాల్పులు
  • తప్పించుకునే క్రమంలో బ్విగ్ ట్విస్ట్ ఇచ్చిన బైక్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపేశారు. అనంతరం వారు పారిపోయేందుకు ప్రయత్నించగా బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

దారుణ ఘటన కత్వారు కా పురా ప్రాంతంలో జరిగింది. బాధితుడిని న్యాయవాది రాజీవ్ సింగ్ గా గుర్తించారు. సింగ్ తన దినచర్యలో భాగంగా శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దండుగులు సింగ్ వాకింగ్ చేస్తున్న ప్రాంతంలో బండిని నిలిపారు. ఓ వ్యక్తి బైక్ పై ఉండగా.. మరో వ్యక్తి నాటు తుపాకీతో సింగ్ వైపు దూసుకొచ్చాడు. ఇదిగమనించి రాజీవ్ సింగ్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నిందితుడు సింగ్ పై కాల్పులు జరిపాడు. అతను వెంటనే కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.

ఆ తరువాత నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్రమత్తమైన దుండుగులు తుపాకీతో స్థానికులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఇంతలో బైక్ స్టార్ట్ కావడంతో దుండుగులు ఇద్దరు బైక్‌పై పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.

ఈ ఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్వారు కా పురా ప్రాంతంలో జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రాజీవ్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. న్యాయవాది రాజీవ్ సింగ్ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.