Tanya Appachu Kaul : ఈ కారణాలతో కూడా విడాకులు తీసుకుంటారా..? ఓ లాయర్ పోస్ట్ వైరల్
విడిపోవాలనుకున్న జంటలకు చిన్న చిన్న సమస్యలే సాకుగా కనిపిస్తాయేమో.. ఇటీవల కాలంలో కొందరు విడిపోవడాని చెప్పిన విచిత్రమైన కారణాలను ఓ లాయర్ పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ కారణాలేంటి? చదవండి.
- Lakshmi 10tv
- Published On : October 15, 2023 / 03:17 PM IST
Tanya Appachu Kaul
Tanya Appachu Kaul : ముంబయికి చెందిన లాయర్, కంటెంట్ క్రియేటర్ తాన్య అప్పచు కౌల్ ఇటీవల కాలంలో కొన్ని జంటలు విడాకులు తీసుకోవడానికి గల విచిత్రమైన కారణాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇంటర్నెట్‌లో ఆమె పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ODI World Cup 2023: జై శ్రీరాం అంటూ పాక్ ప్లేయర్ ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
లాయర్ కౌల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో (yourinstalawyer) ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఇటీవల జంటలు విడిపోవడానికి గల కారణాలను చెప్పారు. హనీమూన్ టైమ్‌లో భార్య అసభ్యంగా దుస్తులు ధరించడం ఒక కారణమని, భర్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతూ భార్యకు తగిన సమయం ఇవ్వలేదని.. భార్య భర్త పాదాలకు నమస్కరించడానికి తిరస్కరించిందని.. భార్యకు వంట చేయడం రాకపోవడంతో బ్రేక్ ఫాస్ట్ లేకుండానే ఉద్యోగానికి వెళ్లవలసి వచ్చిందని.. ఇలాంటి కారణాలతో విడిపోతున్నారంటూ ఆమె హైలైట్ చేసారు.
India vs Pakistan : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కు కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో వైరల్
‘భర్త అతిగా ప్రేమ, శ్రద్ధ చూపుతాడని.. అస్సలు గొడవ పడడని’ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కూడా లాయర్ కౌల్ తన పోస్టులో ప్రస్తావించారు. 2020 లో ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన భర్త తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, పెళ్లైన 18 నెలలో ఎప్పుడూ గొడవ పడలేదని అతని నుండి విడాకులు కావాలని దాఖలు చేసింది. బహుశా కౌల్ ఈ కేసును గుర్తు చేసి ఉండవచ్చును. కౌల్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈరోజుల్లో చాలామంది జంటలకు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. లాయర్ పోస్ట్ చూస్తుంటే విడిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాక కొన్ని జంటలు చిన్న చిన్న సమస్యల్ని సాకుగా చూపిస్తున్నారనిపిస్తోంది.
