చిరుతపులి చెంపలు వాయించేసిన బల్లి..!! : తరువాత ఏం జరిగిందో చూడండీ..

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 10:10 AM IST
చిరుతపులి చెంపలు వాయించేసిన బల్లి..!! : తరువాత ఏం జరిగిందో చూడండీ..

Updated On : February 5, 2020 / 10:10 AM IST

ఓ పేద్ద చిరుతపులి చెంపల్ని ఫెళ్లు పెళ్లుమని వాయించేసింది ఓ ఉడుం లాంటి అడవి బల్లి (వాటర్‌ మానిటర్‌). చిరుతపులి పంజాతో కొడితే గింగిరాలు తిరిగి దాని ఆహారం అయిపోయే ఆ అల్ప ప్రాణి తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంతగా పోరాడిందో చూస్తే..ఆశ్చర్యపోవాల్సిందే. 

సాధారణంగా జంతువులు మరికొన్ని జీవులను చంపుతాయనే విషయం తెలిసిందే. ఆకలితో ఉండే జంతువులు..క్రూరమృగాలు ఎంతటి జంతువునైనా వేటాడి చంపి ఆకలి తీర్చుకుంటాయి. అటువంటి ఓ ఘటనలు అడవుల్లో సర్వసాధారణంగా జరుగుతుంటాయి. వాటిని వీడియోల్లో చూస్తే ఎంతో ఆసక్తికి కలిగిస్తుంటాయి. 

అటువంటి ఓ ఘటన జాంబియాలో జరిగింది. చిరుత, అడవిబల్లి (వాటర్‌ మానిటర్‌)కు మధ్య ఈ పోటీ జరిగింది. కైంగు సఫారీ లాడ్జ్‌ పార్కులో ఓ చిరుత పొదల్లో నుంచి రోడ్డువైపుగా వచ్చింది. అటువైపు నుంచి వస్తోన్న అడవి బల్లిని చూసింది. దాని దగ్గరకు వెళ్లింది. అది గమనించిన బల్లి ఏ మాత్రం భయపడకుండా తన తోకతో చిరుతను దగ్గరకి రానీయకుండా బలంగా పెళ్లు పెళ్లుమంటూ కొట్టింది. అలా ఒకసారికాదు పదే పదే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎంతగానో చిరుతతో పోరాడింది. 

కానీ క్రూరమృగం..పైగా చిరుతపులి. తన ఆకలి తీర్చుకోవటానికి ఎంత భయంకరంగా వేటాడుతుందో చెప్పనక్కరలేదు. అలా చిరుత.. ఆ అడవి బల్లి తోకతో కొట్టే దెబ్బల్ని తట్టుకుంటూ..ఒక్కోసారి తప్పించుకుంటూ దాన్ని వదలిపెట్టకుండా వెంటాడింది. 

చివరికి..ఆకలితో ఉన్న చిరుత..ప్రాణం కోసం పోరాడిని ఉడుంల పోరాటంలో చివరికి చిరుతే గెలుపు సాధించింది. ఆ బల్లిని నోట కరుచుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. 2018లో జరిగిన ఈ వీడియోను తాజాగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఈ వీడియో ఇపుడు తెగ వైరల్‌ గా మారింది.