Weather Updates: బలపడనున్న అల్పపీడనం..! ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు..!
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

Weather Updates: ఒడిశా తీరానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు (ఆగస్టు 27) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రానున్న రెండు రోజులు వాతావరణం ఈ విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
బుధవారం (27-08-25)
* అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్.
* మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
గురువారం (28-08-25)
* కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశ.
మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి సాలపువానిపాలెంలో 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 58 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 55.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా గంధవరంలో 55.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లంకేలపాలెంలో 55.2 మిల్లీమీటర్లు, విజయనగరం అర్బన్ 54.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 65 ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
Also Read: కుడివైపా? ఎడమవైపా? ఇంట్లో పెట్టే వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది.. పండితులు ఏం చెబుతున్నారు..