తల నుంచి పాదం వరకు.. గణేశుడి విగ్రహాన్ని కొనేముందు ఈ రూపాలని చూసి, కొనాల్సిందే.. లేదంటే..
ఏదో పెట్టేశాము, ఏదో చేసేశాము, పూజా అయిపోయింది అని అనుకోవద్దు. వినాయకుడిని పూజించడం వల్ల ఐశ్వర్యము, జ్ఞానము, సిద్ధి, మోక్షము ఇస్తాడని హిందువుల నమ్మకం.

Vinayaka Chavithi 2025
Vinayaka Chavithi 2025: గణేశుడి విగ్రహాన్ని కొనేముందు కొన్ని రూపాలని చూసి కొనాలి. లేదంటే పూజకు తగ్గ ఫలము ఉండదని పండితులు అంటున్నారు. తల నుంచి పాదం వరకు ఒక్కోటి ఎలా ఉండాలో చూద్దాం..
కొంతమంది గణేశ విగ్రహానికి కళ్లు తయారు చేసేటప్పుడు మనిషికున్నట్లు కళ్లు పెడతారు. అలాంటి కళ్లున్న వినాయకుణ్ని కొనొద్దు. ఏనుగుకి ఎలాంటి కళ్లు ఉంటాయో.. అలాంటి కోలకళ్ల వినాయకుడ్నే మనం కొనుక్కోవాలి.
కొంతమంది కళ్లు సరిగ్గా గమనించరు. గణేశుడి విగ్రహానికి కళ్లు కోపంగా ఉంటాయ్. అలాంటి కళ్లు ఉండే వినాయకుడ్ని కొనొద్దు. తయారు చేసే చోట చాలా రకరకాలుగా చేసేస్తారు. నవ్వుతున్న వినాయకుడ్ని మాత్రమే కొనుక్కోవాలి.
నామాలు పెట్టేటప్పుడు కూడా రకరకాల నామాలు పెట్టేస్తున్నారు. అలాంటి నామాలు కాకుండా పూర్తిగా మూడు రేఖలు, విభూతి రేఖలు ఉన్నది, మధ్యలో బొట్టు ఉన్నది కొనాలి. ఎందుకంటే వినాయకుడు శివశక్తి స్వరూపుడు. శివుడికి, అమ్మవారికి కలిపిన స్వరూపం కాబట్టి ఆ మూడు రేఖలు ఉన్న వినాయకుడ్నే కొనుక్కోవాలి.
తొండం ఎలా ఉండాలి?
కుడి వైపు తిరిగి ఉండే తొండాన్ని మనము ఇంట్లో వాడకూడదు. అది గుళ్లలో లేదా పెద్ద పెద్ద ప్రదేశాల్లో వాడాలి. మన ఇంట్లో ఎడమ వైపు తిరిగి ఉండే తొండం ఉండే వినాయకుడ్ని మాత్రమే పెట్టుకోవాలి. తొండము క్లియర్‌గా కనిపడాలి. అది ఎదురుగా కనపడరాదు.
నాలుగు చేతులు ఉంటే వినాయకుడ్ని కొనండి. ఒక చేతిలో నమో మోదకం ఉండాలి, ఇంకో చేతిలో కమలం ఉండాలి. మిగతా రెండు చేతుల్లోనూ అంకుశము, పాశము ఉండాలి. (Vinayaka Chavithi 2025)
Also Read: Ganesh Chaturthi Moon: వినాయక చవితి.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? పొరపాటున చూస్తే ఏం చేయాలి?
ఒక దంతము విరిగిన వినాయకుడ్ని కొనొద్దు. ఒక దంతము పూర్తిగా ఉంటుంది, ఒక దంతము సగమే ఉంటుంది. ఆ సగం విరిగిన వినాయకుడు ఒక చేత్తో పట్టుకునుంటాడు. ఆ విరిగిన దంతాన్ని ఒక చేత్తో పట్టుకున్నట్టు గావున్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని కొనకూడదు.
ఏడు నుంచి తొమ్మిదంగుళాల ఎత్తుకన్నా మించి ఉండే విగ్రహాన్ని కొనవద్దు.
కొందరు మూషికాన్ని వేరేగాను, వినాయకుడిని వేరేగాను పెట్టి విగ్రహాలు తయారు చేస్తుంటారు. అలా ఇద్దర్నీ విడదీయకుండా.. ఇద్దరు ఒకే దగ్గర ఉండేలాగా ఉన్న విగ్రహాన్ని కొనుక్కోండి.
మనము అలాంటి వినాయకుడినే పూజించాలి. ఏదో పెట్టేశాము, ఏదో చేసేశాము, పూజా అయిపోయింది అని అనుకోవద్దు. వినాయకుడిని పూజించడం వల్ల ఐశ్వర్యము, జ్ఞానము, సిద్ధి, మోక్షము ఇస్తాడు.