Ganesh Chaturthi Moon: వినాయక చవితి.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? పొరపాటున చూస్తే ఏం చేయాలి?
అయితే, పండుగ సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని పని ఒకటి ఉంది. అదేమిటంటే.. చవితి రోజున చంద్రుడిని చూడకూడదు.

Ganesh Chaturthi Moon: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైపోయింది. ఊరువాడ ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. వాడవాడలా గణనాధులు కొలువుదీరుతున్నారు. వినాయక చవితి నాడు విఘ్నాధిపతిని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరతాయని, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు.
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ గణేష్ చతుర్థి. అడ్డంకులను తొలగించే దేవుడిగా, జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించే దైవంగా గణపయ్యను పూజిస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే, పండుగ సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని పని ఒకటి ఉంది. అదేమిటంటే.. చవితి రోజున చంద్రుడిని చూడకూడదు.
చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చతుర్థి తిథి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం. పొరపాటున చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం..
వినాయక చవితి నాడు చంద్రుడిని చూడటం అశుభం అని పండితులు చెబుతారు. వినాయకుడుని చంద్రుడు ఎగతాళి చేయడంతో పార్వతికి కోపం వచ్చి చంద్రుడుని శపించిందట. అందుకే ఆ రోజు చంద్రుడిని చూడకూడదని అంటారు.
భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున చంద్రుడిని చూడడం అశుభంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, ఒకసారి చంద్రుడు గణేశుడి రూపాన్ని ఎగతాళి చేయడం వల్ల ఆయనకు శాపం వచ్చింది. కాబట్టి గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకుండా జాగ్రత్త వహించాలి. పొరపాటున చంద్రుడిని చూస్తే కష్టాలు మొదలవుతాయట. నిందల పాలవుతారట.
పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలి?
ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే శ్రీమద్భాగవతంలో ఉన్న శమంతక మణి కథను చదవాలి. అలా చేయడం వలన దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. వినాయక చవితి వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే కూడా దోషం తొలగిపోతుందని అంటారు. దృక్ పంచాంగ్ ప్రకారం గణేష్ చతుర్థి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే నీలాపనిందల నుంచి బయటపడేందుకు “సింగ్ ప్రసేనాంవధిత్సింఘో జాంబవత హతః’. సుకుమారాక్ మరోదిస్తవ హ్యేష స్యమంతకః” అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.
Also Read: ఇంట్లో వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!