Colon Cancer: కోలన్ క్యాన్సర్ అంటే ఏమిటి.. ప్రమాద స్థాయి ఎంత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోలన్ క్యాన్సర్ అనేది పెద్దపేగులో వచ్చే క్యాన్సర్. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా కనిపించే క్యాన్సర్(Colon Cancer) రకాలలో ఇది ఒకటి.

Colon cancer symptoms and prevention measures
Colon Cancer: కోలన్ క్యాన్సర్ అనేది పెద్దపేగులో వచ్చే క్యాన్సర్. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా కనిపించే క్యాన్సర్ రకాలలో ఇది ఒకటి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కాబట్టి, ఈ సమస్య గురించి, దీని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి, కోలన్ క్యానర్(Colon Cancer) ఎందుకు వస్తుంది? నివారణ చర్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కోలన్ క్యాన్సర్ ఎలా వస్తుంది?
పెద్ద పేగుల లోపల ఉండే కణాలు అసాధారణంగా పెరుగుతూ, ఒక మాస్ రూపంలో మారితే కొంతకాలానికీ అది క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. ఈ పొలిప్స్ తొలిదశలో నిర్దుష్టంగా ఉంటాయి. కానీ, తొందరగా గమనిస్తే క్యాన్సర్ గా అభివృద్ధి చెందుతాయి. ముందే గమనిస్తే క్యానర్ ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు.
ప్రమాద స్థాయి ఎంత?
కోలన్ క్యాన్సర్ ప్రమాద స్థాయి వ్యక్తికి వ్యక్తికి తేడాగా ఉంటుంది. అయితే, కొన్ని ముఖ్యమైన ప్రమాద కారణాలలో 50 ఏళ్ళు పైబడినవారికి ఎక్కువ ప్రమాదం కావచ్చు. కుటుంబంలో ఎవిరికైనా కోలన్ క్యాన్సర్ ఉన్నట్లయితే సబ్యులకు వచ్చే అవకాశం ఉంది. ఆలాగే ఎక్కువగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారిలో దీని ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.
లక్షణాలు ఏమిటి?
తొలిదశల్లో కోలన్ క్యాన్సర్ కు లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మలంలో రక్తం, మలవిసర్జన తీరులో మార్పులు, పొట్ట నొప్పి, గాస్, బరువు అనుకోకుండా తగ్గిపోవడం, అలసట, నీరసం, మలబద్ధకం, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.నిరంతర స్క్రీనింగ్ / పరీక్షలు:
45 ఏళ్ళ వయస్సు దాటినవారు రెగ్యులర్‌గా కాలన్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. కోలొనోస్కోపీ (Colonoscopy) ద్వారా పొలిప్స్‌ను తొలిదశలో గుర్తించి తొలగించవచ్చవచ్చు.
2.ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి:
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు, పిండిదినుసులు ఎక్కువగా తినాలి. రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం తగ్గించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
3.శారీరక శ్రమ:
ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి.
చికిత్సా విధానాలు:
- పేగులోని క్యాన్సర్ భాగాన్ని సర్జరీతో తొలగించటం
- కీమోథెరపీ
- రేడియేషన్ థెరపీ
- టార్గెట్ థెరపీ / ఇమ్యునోథెరపీ (కొందరికి మాత్రమే)
- చికిత్సా ఎంపిక రోగి ఆరోగ్య స్థితి, వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది.
కోలన్ క్యాన్సర్ ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారించగలిగే క్యాన్సర్ రకాలలో ఒకటి. ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో పరీక్షలు, అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.