LIC Jeevan Labh Policy: రోజుకు రూ.233 చెల్లించండి.. రూ.17లక్షల పొందండి

కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తోన్న ఎల్ఐసీ సంస్థ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ పాలసీలతో ప్రజల ముందుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా కచ్చితమైన లాభాలు తెచ్చిపెట్టే సంస్థ మరో పాల‌సీ

Lic Jeevan P[olicy

LIC Jeevan Labh Policy: కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తోన్న ఎల్ఐసీ సంస్థ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ పాలసీలతో ప్రజల ముందుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా కచ్చితమైన లాభాలు తెచ్చిపెట్టే సంస్థలో ఇప్పుడు మరో పాల‌సీ సిద్ధంగా ఉంది. ఎల్ఐసీ జీవ‌న్ లాభ్ స్కీమ్‌లో నెల‌కు రూ.233 ఇన్వెస్ట్ చేసి మెచ్యూరిటీ నాటికి మీరు రూ.17 ల‌క్ష‌లు మొత్తంగా పొందొచ్చు.

జీవ‌న్ లాభ్ అని పిలుస్తున్న ప్ర‌త్యేక బీమా పాల‌సీ వివ‌రాలిలా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేని పాలసీ ఇది. అంటే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. దీనిపై ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా సురక్షితం. ప్రీమియం ప్లాన్‌తోపాటు టైం లిమిట్‌ క‌లిగి ఉన్న బీమా పాల‌సీ.

……………………………. : చిన్నారులు ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే?..

పిల్ల‌ల వివాహం, విద్య‌, ఆస్తుల కొనుగోలును దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన బీమా పాల‌సీ ఇది.
8 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులు ఎవ‌రైనా ఈ పాల‌సీ పొందొచ్చు.
ఈ పాల‌సీ ట‌ర్మ్ 16-25 ఏళ్ల మ‌ధ్య ఎంతైనా ఎంచుకోవచ్చు.
క‌నీస మొత్తం అస్యూరెన్స్ రూ.2 ల‌క్ష‌లతో ఈ పాల‌సీ ల‌భిస్తుంది. గ‌రిష్ఠ మొత్తానికి ప‌రిమితి లేదు.
మూడేళ్ల ప్రీమియం చెల్లింపుల‌పై రుణ సదుపాయం కూడా ల‌భ్య‌మ‌వుతుంది.
బీమా ప్రీమియంపై ట్యాక్స్ మిన‌హాయింపు పొందొచ్చు. అనుకోకుండా పాల‌సీదారు మ‌ర‌ణిస్తే నామినీకి మెచ్యూర్డ్ మొత్తం ప్ల‌స్ బోన‌స్ అంద‌జేస్తారు.