Lic Share
LIC Share: ఎల్ఐసీ షేర్ ఆల్ టైం దిగువకు పడిపోయింది. వరుసగా తొమ్మిది రోజులుగా పడుతూ ఉన్న షేర్ ప్రభావానికి షేర్ హోల్డర్లు లిస్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి రూ.1.41లక్షల కోట్లు పోగొట్టుకున్నారు.
బీఎస్‌ఈలో రూ. 731.10 వద్ద తాజా కనిష్ట స్థాయికి చేరుకుంది. బీమా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4.61 లక్షల కోట్లకు చేరిప తర్వాత గురువారం పతనంతో మరో 2 శాతం పడిపోయింది. ఎల్‌ఐసీ షేర్లు ఇష్యూ ధర రూ. 949 నుండి దాదాపు నాల్గో వంతు సంపదను తుడిచిపెట్టేశాయి. ఎల్‌ఐసీ పెట్టుబడిదారులకు రూ. 1.4 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఎల్ఐసీ షేర్లు మే17న లిస్టింగ్ కాగా, స్టాక్ లో నాల్గో వంతు మాత్రమే లాభాలతో ముగిశాయి. కొద్దిరోజులుగా ఎల్ఐసీ షేర్లు ఒత్తిడిలోనే కనిపిస్తున్నాయి.
Read Also : ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!
లిక్విడిటీ ఆందోళనలు, కఠినతర భయాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్లు అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయని ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్ తెలిపారు. దీర్ఘ కాలిక ముందుచూపుతో స్టాక్‌ను పెట్టుబడిదారులు రోజువారీ ధరల కదలికలను బేస్ చేసుకుని ఎంచుకోకూడదని సింగ్ సూచించారు.
సాంకేతికంగా, ఈ స్టాక్ ట్రెండ్‌లో మార్పును చూడాలంటే, స్టాక్ స్థిరంగా 840 మార్కు కంటే ఎక్కువ ట్రేడ్ అవ్వాలని ఆయన అన్నారు.