బాతు పిల్లకు సింహం సాయం..వీడియో వైరల్
ఓ బాతు పిల్లకు సింహం సహాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
- venkaiahnaidu
- Updated on- March 25, 2021 / 08:26 PM IST
Lion Lovingly Pats Plays With Duck Viral Video Is Melting Hearts Online1
Lion ఓ బాతు పిల్లకు సింహం సాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇంత పెద్ద మాంసాహార జంతువునకు సున్నితమైన హృదయం ఉందని మీలో ఎంత మందికి తెలుసు? అవి అడవి మృగాలే.. కానీ క్రూరమైనవి కాదు. ఆహారం కోసం, రెచ్చగొట్టినప్పుడు మాత్రమే అవి చంపుతాయి. వాటిని గౌరవించి ఆదరించండి అని ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఆ వీడియోలో..ఈదేందుకు కష్టపడుతున్న ఒక బాతు పిల్లను పెద్ద సింహం గమనించింది. వెంటనే బాతు పిల్ల వద్దకు వచ్చిన ఆ సింహం తన కాళ్లతో దానిని నీటిలోకి నెట్టింది. ఈ సందర్భంగా తన కాలితో బాతు పిల్లను మెల్లగా సముదాయించింది. బాతు పిల్లను రక్షించేందుకు సింహం చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడారు. చిన్న ప్రాణి పట్ల అది చూపిన దయా గుణానికి పరవశించిపోయారు.
