Lohagad Fort : కోటకి తీసుకెళ్లి కాబోయే భర్తను తోసేసిన కేసులో భారీ ట్విస్ట్.. అమ్మాయి లవ్ గురించి ఆల్రెడీ..!
Lohagad Fort Murder: నిశ్చితార్థం తర్వాత కూడా చేతన్‌తో రిలేషన్ కొనసాగిందని సియా కుటుంబానికి తెలుసా? అలాగే కేతన్ మరణానికి దారితీసిన కుట్రపై వారికి తెలుసా? లేదా అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు..
- Sreehari A
- Updated on- June 24, 2026 / 10:18 PM IST
Lohagad Fort Murder
Lohagad Fort Murder : పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. పెళ్లి కుదరకముందే అమ్మాయి లవ్ గురించి ఇంట్లో తెలిసే ఉంటుందా? లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, కేతన్ అగర్వాల్ హత్య వెనుక కుట్రను పోలీసులు ఛేదిస్తున్న కొద్దీ ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితుడు చేతన్ చౌదరితో సియా గోయల్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అది ఆమె కుటుంబానికి ఎంతవరకు తెలుసు? అనేది సస్పెన్స్ గా మారింది..
పోలీసు వర్గాల ప్రకారం.. సియా ఫ్యామిలీకి చేతన్‌తో ఆమె రిలేషన్ గురించి తెలుసని, కానీ, అది వారు ఒప్పుకోలేదు. అదే సమయంలో సియా కేతన్‌తో నిశ్చితార్థానికి అంగీకరించడం వెనుక కేసులో కీలక మలుపుగా మారింది. కాబోయే భర్త అగర్వాల్‌ను హతమార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి.
చివరకు జూన్ 18న సియా పుట్టినరోజు పేరుతో కేతన్‌ను లోహగడ్ కోటకు రప్పించింది. అక్కడ చేతన్ చౌదరి అతడిని కొట్టి లోయలోకి తోసేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను ప్రమాదంగా చూపించేందుకు మొదట ‘ఫోటో తీసుకుంటూ జారిపడ్డాడు’ అనే కథను సియా చెప్పినట్టు సమాచారం.
అసలు వ్యవహారం వెలుగులోకి.. :
సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా దాచడంతో వారి బాలి టూర్ క్యాన్సిల్ అయింది. అలాగే హత్యకు ముందు కనీసం 3సార్లు అతనిపై హత్యాయత్నాలు విఫలమయ్యాయని కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం ఘటనపై అనుమానంతో కేతన్ కుటుంబం గట్టిగా ప్రశ్నించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Read Also : Voter Enumeration Form : ఫారం తిరిగి ఇవ్వకపోతే ఏమౌతుంది? ఓటరు ఎప్పుడు సమర్పించాలి? ఏయే పత్రాలు అవసరం?
కేతన్ అగర్వాల్‌తో సియా నిశ్చితార్థం ఖాయం అవ్వడానికి ముందే ఆమె, చేతన్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం సియా ఫ్యామిలీకి తెలుసు కూడా.. అయితే, చేతన్ ఆమెకు తగిన జోడీ కాదని భావించి వ్యతిరేకించారని పోలీసులు వెల్లడించారు. చేతన్‌తో రిలేషన్ ఉన్నా కేతన్‌తో నిశ్చితార్థం ఒప్పుకోవడానికి ఆమె కుటుంబ సభ్యుల బలవంతమే కారణంగా కనిపిస్తోంది.
అయితే, ఇప్పటివరకు, ఈ హత్య కుట్రలో సియా కుటుంబ సభ్యులలో ఎవరిని పోలీసులు అనుమానించలేదు. ఇదిలా ఉండగా, సియా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం పట్ల కేతన్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
కేతన్ తండ్రి ఆరోపణ ఏంటి? :
సియాతో కేతన్ పెళ్లికి సంబంధించి తండ్రి అనిల్ అగర్వాల్ చెప్పిన విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆ సమయంలో కేతన్ పెళ్లికి సిద్ధంగా లేకపోవడం, సియా వయసు చాలా తక్కువని భావించి తమ ఫ్యామిలీ మొదట్లో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని అగర్వాల్ చెప్పారు.
సియా కుటుంబమే పదేపదే తమను సంప్రదించి మళ్లీ ఆలోచాలించాలని ఒప్పించిందన్నారు. ‘ఫస్ట్ వారి ప్రతిపాదనను తిరస్కరించాం. ఆమె కుటుంబం మమ్మల్ని అడుగుతూనే ఉంది. చివరికి మేం అంగీకరించాం. మాకు గోయల్ కుటుంబం 35 నుంచి 40 ఏళ్లుగా తెలుసు. ఇలాంటిది జరుగుతుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లి వద్దంట ’అని అగర్వాల్ అన్నారు.
సియా, ఆమె కుటుంబంపై కూడా కేతన్ తండ్రి విమర్శలు గుప్పించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే వద్దని చెప్పి ఉండవచ్చు కదా అన్నారు. ‘మేమైతే వెంటనే పెళ్లిని రద్దు చేసేవాళ్ళం. వాళ్లు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డారు. మా అబ్బాయిని చంపేంత క్రూరమైన మనస్తత్వం వాళ్లది..’ అంటూ ఆరోపించారు.
