Lovers : పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. కలిసి ఉండలేమని.. కారులోనే
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ మనసులోని మాట పేదలకు చెప్పారు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది
- kunduru Vinod
- Published On : August 14, 2021 / 01:49 PM IST
Lovers
Lovers : ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ మనసులోని మాట పేదలకు చెప్పారు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాకు చెందిన కాంచన (20) నర్సుగా పనిచేస్తుంది. ఆమెకు శ్రీనివాస్ (26)తో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఇక వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయం ఇంట్లో వారికి చెప్పారు. అయితే వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.. బతికి ఉండగా కలిసి ఉండలేమని బాధతో.. మరణంలోనైనా ఒక్కటి కావాలని భావించారు.
శుక్రవారం సాయంత్రం కినకహళ్లి గ్రామంలోని చెరువు వద్దకు చేరుకున్న ప్రేమికులు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు కారులో కూర్చుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
