LPG Cylinder New Rule : గ్యాస్ సిలిండర్‌పై మరో పిడుగులాంటి వార్త.. కేంద్రం కొత్త నిబంధనలు ఇవే.. ఇవి తప్పనిసరి..
LPG Cylinder New Rule : పశ్చిమాసియా యుద్ధం ప్రభావం గ్యాస్ సిలిండర్లపై పడుతోంది. ఎల్పీజీ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. అయితే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
- Harishth Thanniru
- Published On : March 25, 2026 / 09:12 AM IST
LPG Cylinder New Rule
LPG Cylinder New Rule : పశ్చిమాసియా యుద్ధం ప్రభావం గ్యాస్ సిలిండర్లపై పడుతోంది. ఎల్పీజీ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. ఇలాంటి సంమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్దేశించిన కొత్త నిబంధనల ప్రకారం.. బుకింగ్‌లను నెలకు రెండు సిలిండర్లకు, సంవత్సరానికి 15 సిలిండర్లకు పరిమితం చేయడంతోపాటు.. ఓటీపీ ఆధారిత డెలివరీ, తప్పనిసరి e-KYC, అదనపు సిలిండర్ల కోసం హలో బీపీసీఎల్ యాప్ ద్వారా అదనపు ధృవీకరణ వంటి నిబంధనలను ప్రవేశపెట్టారు.
నిబంధనల ప్రకారం..
♦ ఒక గృహ ఎల్పీజీ వినియోగదారుడు ఒకే నెలలో గరిష్ఠంగా రెండు సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు.
♦ సిలిండర్ బుకింగ్ కేవలం రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌తో మాత్రమే చేసేందుకు వీలుంటుంది.
♦ ఒకవేళ కస్టమర్ తమ ఫోన్ నెంబర్‌ను మార్చుకున్నట్లయితే.. దానిని ఏజెన్సీలో లేదా యాప్ ద్వారా అప్‌డేట్ చేయాలి.
♦ గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) అనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తేనే గ్యాస్ డెలివరీ అవుతుంది.
♦ యాప్ ద్వారా అదనపు సిలిండర్ తీసుకోవాలని భావించినప్పుడు వినియోగదారులు పలు విషయాలను వెల్లడించాలి. ఇంట్లో సభ్యుల సంఖ్య, అదనపు అవసరాలకు గల కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది.
♦ ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు కొనసాగే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 12 రాయితీ ఎల్‌పిజి సిలిండర్లను అందించడం కొనసాగిస్తోంది.
♦ వినియోగదారులు తమ 12 రాయితీ సిలిండర్లను గడువుకంటే ముందే ఉపయోగించుకున్నప్పటికీ.. ఇంకా మరిన్ని సిలిండర్లు కావాలనుకుంటే వారు హలో బీపీసీఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను అందించాల్సి ఉంటుంది.
♦ గతంలో, వినియోగదారులు మునుపటి బుకింగ్ తర్వాత 21రోజులకు తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకోగలిగేవారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆ గడువు 25రోజులకు చేరింది.
