LPG e-KYC Alert : LPG గ్యాస్ కస్టమర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆగస్ట్ 16లోపు ఇలా చేయండి.. లేదంటే భారీ నష్టం..!
LPG e-KYC Alert : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? సిలిండర్ కోసం బుకింగ్ చేయాలని చూస్తున్నారా? మందుగా మీ గ్యాస్ కనెక్షన్ కోసం ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి.
- Sreehari A
- Published on- August 5, 2026 / 06:15 PM IST
LPG e-KYC Alert
- ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ అలర్ట్
- ఆగస్టు 16వరకు మాత్రమే చివరి అవకాశం
- కేవైసీ పూర్తి చేయని కస్టమర్లు గ్యాస్ బుకింగ్ చేయలేరు
LPG e-KYC Alert : ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కేవైసీ పూర్తి చేశారా? లేదంటే ఇప్పుడే పూర్తి చేయడం బెటర్.. కేవైసీ పూర్తి చేయని కస్టమర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ (e-KYC) ప్రాసెస్ పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది.
ఇప్పటివరకూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు ఆగస్ట్ 16 వరకు మాత్రమే సమయం ఉంది. ఈ తేదీలోగా కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్‌లో గ్యాస్ బుకింగ్ చేయలేరు.. సిలిండర్ డెలివరీ కాదు.. సబ్సిడీ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది.
గ్యాస్ కనెక్షన్ విషయంలో మోసాలకు అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి గ్యాస్ కనెక్షన్ కోసం కేవైసీని తప్పనిసరి చేశాయి. అందుకు ప్రతిఒక్క వినియోగదారుడు తమ గ్యాస్ కనెక్షన్ వివరాలను చెక్ చేసుకోవాలి.
Read Also : CJP Protest : రాళ్లు విసిరినా సంయమనమే మార్గం.. యువతను శాంతింపజేయాలి : పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు
వినియోగదారుల ఐడెంటిటీ చాలా కీలకం.. ఇప్పటికే చాలామంది కస్టమర్లకు కేవైసీ పూర్తి చేయాలంటూ మెసేజ్ కూడా పంపుతున్నాయి. మీరు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది.
సబ్సిడీ ఆగిపోయాక కేవైసీ పూర్తి చేసినవారికి మళ్లీ సబ్సిడీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీ ద్వారా కూడా ఈజీగా కేవైసీని పూర్తి చేయొచ్చు. లేదంటే ఇంటి వద్దకు వచ్చే గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద బయోమెట్రిక్ డివైజ్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
గతంలో జూలై 31 వరకు కేవైసీ గడువు ఉండగా ఇప్పుడు ఆగస్ట్ 16 వరకు పొడిగించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇప్పటినుంచే కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. వరుసగా 2 నెల కూడా ఈ సిలిండర్ల ధర తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పుల్లేవు.
LPG ఇ-కేవైసీని ఎలా పూర్తి చేయాలి? :
- ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేక విధాలుగా పూర్తి చేయవచ్చు
- ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా (ఇండియన్ ఆయిల్ కస్టమర్లు)
- మీ ఎల్‌పీజీ కంపెనీ అధికారిక మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా
- మీ సమీపంలోని ఎల్‌పీజీ పంపిణీదారు లేదా గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం
- సిలిండర్ డెలివరీ సమయంలో ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది ద్వారా
- వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు ఆధార్ కార్డు, రిజిస్టర్ మొబైల్ నంబర్, ఇతర గుర్తింపు వివరాలు అవసరం
