×
Ad

Lucknow : హోలీ స్పెషల్, బాహుబలి గుజియా..1.5 కిలోలు, 14 ఇంచుల స్వీట్

హోలీ పండుగ సందర్భంగా...లక్నోలో ఉన్న ఓ స్వీటు షాపు యజమాని ఒక వెరైటీ స్వీటును తయారు చేశారు.

  • Published On : March 27, 2021 / 05:48 PM IST

Bahubali Gujiya

‘Bahubali Gujiya’ : హోలీ ..రంగు రంగుల పండుగ. రంగులు చల్లుకుంటూ..ఎంతో ఎంజాయ్ చేసే ఈ ఫెస్టివల్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు హోలీ ఫెస్టివల్ ను జరుపుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే..హోలీ పండుగ రాగానే..నోరూరించే స్వీట్లు గుర్తుకొస్తుంటాయి. బంధువులు, స్నేహితులకు రకరకాలైన స్వీట్లు పంచుకుంటూ..విషెస్ తెలియ చేసుకుంటుంటారు.

లక్నోలో ఉన్న ఓ స్వీటు షాపు యజమాని ఒక వెరైటీ స్వీటును తయారు చేశారు. సిటీలో ఉన్న Chhappan Bhog షాపు నిర్వాహకులు ‘Bahubali Gujiya’ స్వీటును తయారు చేశారు. దీని బరువు 1.5 కిలోలు ఉ:డగా..14 ఇంచుల పొడవు ఉంది. ఖోయా, కుంకుమ పువ్వు, బాదం, పిస్తా, చక్కెర ను ఉపయోగించి తయారు చేశారు. దీనిని వేయించడానికి సుమారు 20 నుంచి 25 నిమిషాలు పడుతుందని యజమాని వెల్లడించారు. ఇక దీనిని కొనాలంటే..మాత్రం రూ. 1200 చెల్లించాలి. ప్రతి సంవత్సరం తమ కస్టమర్లను ఆశ్చర్యపరిచేందుకు కొత్త కొత్త స్వీట్లను తయారు చేస్తుంటామని Kshitij Gupta తెలిపారు. ‘Bahubali Gujiya’ విజయవంతమైందని, కస్టమర్లను నుంచి సానుకూలంగా స్పందన వస్తోందన్నారు.


Read More : Gold Smugglers : గోల్డ్ ఛైన్ ను తీసుకెళుతున్న చీమలు, అరెస్టు చేశారా ?