Maa Kali Costume Controversy : కాళీమాత వేషధారణపై దుమారం.. ఇలా చూపించడమేంటి..? వీడియో వైరల్.. రచ్చరచ్చ! చివరికి బిగ్ ట్విస్ట్..
Maa Kali Costume Controversy : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఓ నృత్య నాటిక ప్రదర్శన వివాదానికి దారితీసింది.
- Harish Thanniru
- Updated on- August 13, 2026 / 01:19 PM IST
Maa Kali Costume Controversy
Maa Kali Costume Controversy : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఓ నృత్య నాటిక ప్రదర్శన వివాదానికి దారితీసింది. ‘నిత్య – ఫ్యాకల్టీ ఆఫ్ సైట్’ అనే డ్యాన్స్ ప్రొడక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కోల్‌కతాలోని తాలా పార్క్ ప్రాంతంలోని మొహిత్ మంచ్‌లో ‘మహావిద్య’ అనే పౌరాణిక నృత్య నాటికను ప్రదర్శించారు. ఇందులో కాళీమాత పాత్రధారణ చేసిన కళాకారిణి ధరించిన దుస్తులపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ వివాదంపై నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో.. ప్రదర్శనకు సంబంధించిన కొరియోగ్రఫీ, నృత్యం సంబంధిత కళాకారిణి తీసుకున్న నిర్ణయం మేరకు జరిగాయని, ప్రదర్శనకు సంబంధించిన స్క్రిప్ట్, ఆడియో మాత్రమే తాము అందించడం జరిగిందని పేర్కొన్నారు. తుది ప్రదర్శనకు ముందు ఆమె ధరించాల్సిన దుస్తులతో రిహార్సల్ కూడా జరగలేదని వివరించారు. తాము ఊహించిన దుస్తులకు భిన్నంగా తుది ప్రదర్శనలో పూర్తిగా వేరే దుస్తులతో కళాకారిణి వేదికపైకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటన పట్ల ప్రేక్షకులు, కళాకారులు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు.
सोशल मीडिया पर एक वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक युवती देवी का रूप धारण कर नृत्य करती नजर आ रही है। वीडियो के पहनावे और प्रस्तुति को लेकर बड़ी संख्या में लोग धार्मिक भावनाएं आहत होने की बात कह रहे हैं और FIR की मांग कर रहे हैं।
मैं स्पष्ट करना चाहता हूं कि मेरा… pic.twitter.com/TbUw8HsDeP
— Saurav paswan (@saurav_paswan2) August 12, 2026
అసలు వాస్తవం ఇది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహిళ లోదుస్తులు వేసుకొని అమ్మవారి వేషధారణలో నృత్యం చేస్తున్నట్లుగా ఉంది. అయితే, వైరల్ అవుతున్న క్లిప్‌కు సంబంధించిన వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని చెబుతున్నారు. స్టేజ్‌పై అమ్మవారి వేషధారణలో నృత్యం చేసింది మహిళ కాదట. దుస్తులు కూడా స్కిన్ టైట్ కాస్ట్యూమ్, డార్క్ బాడీ పెయింట్ ధరించిన పురుష కళాకారుడు అని పేర్కొంటున్నారు.
అలాగే.. వీడియోలో కనిపిస్తున్న రూపం మా కాళీది కాదని, దశ మహావిద్యల్లో ఒకరైన ‘మా ఛిన్నమస్తిక’కు సంబంధించిన ఉగ్ర స్వరూపాన్ని ప్రతిబింబించే నృత్య ప్రదర్శన అని వివరణలు వెలువడుతున్నాయి. ఈ రూపంలో కామదేవుడు, రతి దేవిపై నిలుచున్నట్లు శాస్త్ర, కళారూపాల్లో చిత్రీకరణలు కనిపిస్తాయి. అందువల్ల ఇది అసభ్యకరమైన డ్యాన్స్ కాదని.. ‘దశ మహావిద్యలు’ అనే ఆధ్యాత్మిక అంశంపై రూపొందించిన నృత్య నాటికలోని ఒక భాగం అని చెబుతున్నారు.
