Madhya Pradesh Baby: 4 చేతులు, 4 కాళ్ళతో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వింత‌శిశువు జ‌న‌నం.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh Baby) లవ్‌కుష్‌నగర్‌లో ఒక అరుదైన, అసాధారణమైన వైద్య పరిణామం చోటుచేసుకుంది.

Madhya pradesh baby born with four arms and four legs

  • అరుదైన వింత శిశువు జననం
  • శస్త్రచికిత్సకు వైద్యుల నిరీక్షణ
  • ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్ తరలింపు

Madhya Pradesh Baby: మధ్యప్రదేశ్‌లోని లవ్‌కుష్‌నగర్‌లో ఒక అరుదైన, అసాధారణమైన వైద్య పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఒక మగ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. ఈ వార్త తెలియడంతో స్థానికులు ఆ అద్భుతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిశువు ఛాతీ భాగం నుంచి అదనపు అవయవాలు పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. జన్యుపరమైన లోపాల కారణం చేతనే ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Pan Masala Raid: హైదరాబాద్‌లో భారీ పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్.. వేల కిలోల పొగాకు స్వాధీనం

అదనపు అవయవాల తొలగింపునకు చర్యలు:

శస్త్రచికిత్స ద్వారా అదనంగా ఉన్న కాళ్లు, చేతులను తొలగించేందుకు వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, సర్జరీ చేయడానికి ముందు ఆ అవయవాలలోని ఎముకల అనుసంధానం, రక్త ప్రసరణ వ్యవస్థను సంపూర్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిశువుకు పలు రకాల ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నివేదికలు అందిన తర్వాతే తుది శస్త్రచికిత్స పై పూర్తి స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.

జబల్‌పూర్ ఆసుపత్రికి తరలింపు – నిరంతర పర్యవేక్షణ:

శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించింది. బాలుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జబల్‌పూర్‌లోని(Madhya Pradesh Baby) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వేగంగా తరలించారు. ప్రస్తుతం నిపుణులైన ప్రత్యేక వైద్యుల బృందం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చికిత్స అందిస్తోంది.