illicit liquor coming out of hand pump
liquor coming In hand pump : బోరింగ్ పంపు కొడితే ఎక్కడైనా నీరే వస్తుంది. ఈనీరు ఉప్పగా ఉండొచ్చు మరే రుచిలో అయినా ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం బోరింగ్ పంపు కొడితే బక్కెట్లు, బిందెలకొద్దీ మద్యం వెల్లువలా వస్తోంది. దీన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు.ఏమిరా ఈ వింత అని నోరెళ్లబెట్టారు. ఇంతకీ బోరింగ్ పంపులోంచి నీటికి బదులు మద్యం రావటం వెనుక పెద్ద స్టోరీచే ఉంది.అదేంటో తెలిస్తే మనం కూడా నోరెళ్లబెట్టాల్సిందే…!
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బోరింగ్ పంపు కొడితే బిందెలు..బకెట్ల కొద్దీ మద్యం వెల్లువలా రావటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిసి ఓర్నీ మీ తెలివితేటలు ‘పొంగిపోనూ’అని ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లో డ్రగ్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డ్రగ్స్ తరలింపులు..వినియోగాలు ఆపాలని పోలీసులు ఆదేశించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం పలు జిల్లాల్లో దాడులు చేపట్టింది. దీంట్లో భాగంగా పోలీసులు..ఎక్సైజ్ అధికారులు గుణాలో దాడి నిర్వహిస్తుండగా..బోరింగ్ పంపులోంచి మద్యం పొంగిరావటం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుణాలో మద్యం మాఫియా తెలివితేటకు నిదర్శనంగా కనిపిస్తోంది ఈ బోరింగ్ పంపు. అక్రమ మద్యం అమ్మకాల కోసం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేసింది మద్యం మాఫియా. పలు దాడుల్లో భాగంగా పలు అనుమానాలు వచ్చిన పోలీసులు దేన్నీ వదలకుండా తనిఖీలు చేస్తుండగా ఈ బోరింగ్ పంపు మద్యం గుట్టు బయటపడింది. అలా చేతి పంపును కోట్టి చూసిన ఖాకీలు కంగుతిన్నారు.
అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది. అలా పలు ప్రాంతాల్లో దాడుల్లో భాగంగా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.
బోరింగ్ పంపు కొడితే బిందెలు..బకెట్ల కొద్దీ మద్యం వెల్లువలా రావటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిసి ఓర్నీ మీ తెలివితేటలు ‘పొంగిపోనూ’అని ఆశ్చర్యపోయారు.
आपने हैंडपंप से पानी निकलते देखा होगा, अब अवैध शराब निकलती देखिए, तस्वीर #MadhyaPradesh के #गुना की है,@ChouhanShivraj के निर्देश के बाद पुलिस की नशे के खिलाफ कार्रवाई जारी है।@drnarottammisra @DGP_MP pic.twitter.com/qiuZ2IZjm6
— Makarand Kale (@makarandkale) October 11, 2022