Kidney Problems : అందం కోసం క్రీములు వాడుతున్నారా? అయితే, మీ కిడ్నీలను ఓసారి చెక్ చేసుకోండి.. వైద్య పరీక్షల్లో విస్తుపోయే వాస్తలు
Kidney Problems Caused By Beauty Creams : సౌందర్యం కోసం వివిధ క్రీములు వాడే ముందు వాటి ఉత్పత్తులను గుడ్డిగా నమ్మకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొనే ముందు వాటిలో వాడిన పదార్థాలు, తయారీ సంస్థ, అధికారిక అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- July 6, 2026 / 01:58 PM IST
Maharashtra FDA has issued health alert against three skin-lightening creams after laboratory tests
Kidney Problems Caused By Beauty Creams : ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. కొందరు అందంకోసం అధికంగా క్రీములను వాడుతుంటారు. అలాంటి వారిని బలహీనతను ఆసరాగా చేసుకొని మార్కెట్లో ఇన్‌స్టంట్ ఫెయిర్‌నెస్ పేరుతో విక్రయిస్తున్న కొన్ని బ్యూటీ క్రీములు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి క్రీములు వాడిన వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తేలింది.
Also Read : Pooja Hegde : షార్ట్ హెయిర్‌తో బ్యాక్ అందాలు చూపిస్తూ.. పూజ హెగ్డే లేటెస్ట్ ఫొటోలు వైరల్..
మహారాష్ట్రంలోని ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆహార, ఔషద పరిపాలన శాఖ (FDA) కీలక నిర్ణయం తీసుకుంది. చర్మాన్ని తెల్లగా మారుస్తాయని ప్రచారం చేసే మూడు బ్యూటీ క్రీముల్లో ప్రమాదకర స్థాయిలో పారసం, సీసం ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలడంతో వాటి విక్రయాలు, వినియోగంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేధించిన ఉత్పత్తుల్లో గోరీ బ్యూటీ క్రీమ్, ఫేస్ ఫ్రెస్గోల్డ్ బ్యూటీ క్రీము అండ్ సీరమ్, గోల్డెన్ స్టార్ బ్యూటీ క్రీమ్ ఉన్నాయి. వీటిలో గోరీ బ్యూటీ క్రీమ్ పాకిస్థాన్ లో తయారవుతుందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లో తయారైన ఈ బ్యూటీ క్రీమ్ సోషల్ మీడియా పేజీలు, మీషో లాంటి ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా విక్రయించినట్లు తెలుస్తోంది. పాక్ నుంచి దిగుమతులు నిషేధం ఉన్నప్పటికీ.. ఈ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ఎలా వచ్చాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నాగ్‌పూర్‌లో గత రెండేళ్లలో 18మంది మహిళలు కిడ్నీ సమస్యతో బాధపడిన కేసులను వైద్యులు పరిశీలించారు. వారందరూ గోరీ బ్యూటీ క్రీమ్ వాడినట్లు గుర్తించారు. అనంతరం ఎఫ్డీఏ అధికారులు క్రీమ్ నమూనాలను పరీక్షించగా.. చట్టపరమైన పరిమితి కంటే 752 రెట్లు ఎక్కువ పాదరసం ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రీములు ఎక్కువకాలం ఉపయోగిస్తే శరీరంలో పాదరసం పేరుకుపోయి కిడ్నీలు, నాడీ వ్యవస్థ, చర్మానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ హెచ్చరించింది. ఈ ఉత్పత్తులపై తయారీదారు పేరు, చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీవంటివి తప్పనిసరి వివరాలు కూడా లేవని పేర్కొంది.
సౌందర్యం కోసం వివిధ క్రీములు వాడే ముందు వాటి ఉత్పత్తులను గుడ్డిగా నమ్మకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొనే ముందు వాటిలో వాడిన పదార్థాలు, తయారీ సంస్థ, అధికారిక అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
