Conference Calls చేస్తున్నారా.. బిల్లులు పెంచేసిన  Trai

  • Publish Date - May 12, 2020 / 01:46 PM IST

ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ కాల్ లో జాయిన్ అవుతున్నారా.. లేదా ఇంటర్నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ కు డయల్ చేశారా.. టెలికామ్ ఆపరేటర్లు ISD రేట్లనే వసూలు చేయనున్నారు. కొత్తగా వచ్చిన రేట్లను బట్టి వాడుకోవాలని ముందుగానే నియమ నిబంధనలను చూసుకుని కొనుగోలు చేయాలని TRAI సూచిస్తుంది. కొందరు వినియోగదారుల బిల్లు మోత మోగడంతో TRAI కస్టమర్ల నోటీస్ కు తీసుకురావాలని భావించింది.

ఆన్ లైన్లో కాన్ఫిరెన్స్ కాల్ కు జాయిన్ అయినప్పుడు లేదా ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇది ఫేస్ చేశామని వారు చెప్తున్నారు. కొవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ లో ఉండి తెగ ఫోన్ కాల్స్ చేసేస్తున్నారట. ఇలా చేసే ముందు ఓ సారి కాల్ ఛార్జీలు చూసుకోవాలని, హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలు తెలుసుకుని డయల్ చేయాలని ట్రాయ్ సూచించింది. 

ఈ ఐఎస్‌డీ రేట్లు ఇంటర్నేషనల్ వాయిస్ కాల్స్ కు మాత్రమే కానీ స్కైప్, వాట్సప్, జూమ్ వంటి సర్వీసులకు కాదు. డేటా వాడుకుని చేసే వీడియో కాల్స్, కాన్పిరెన్స్ కాల్స్ కు అదనంగా ఎటువంటి ఛార్జీలు పడవు. కస్టమర్ కేర్ సెంటర్లు, సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నేషనల్ నెంబర్లతో వచ్చేకాల్సే ప్రీమియం నెంబర్లతో కూడి ఉంటాయి. అవి ఆన్సర్ చేస్తే మనం ఎక్స్ ట్రా పే చేయాల్సి రావొచ్చు. 

పోస్టు పెయిడ్ యూజర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వీరి నుంచే కాన్ఫిరెన్స్ కాల్స్ విషయంలో ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయని కస్టమర్ కేర్ కు కాల్స్ వెళ్తున్నాయట.