Surat: నోటి నుంచి మంట పుట్టించేందుకు ప్రయత్నం.. ఒళ్లంతా అంటుకున్న మంటలు.. వీడియో వైరల్
అగ్నితో ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదం. కావాలంటే ఈ వీడియో చూడండి. ఒక యువకుడు నిప్పుతో ఆడుకోవాలనుకుంటే.. మంటలు ఒళ్లంతా అంటుకున్నాయి. కానీ, ఆ కుర్రాడు జాగ్రత్తపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- Narender Thiru
- Published On : September 1, 2022 / 07:49 PM IST
Surat: అందరిముందూ చేసే స్టంట్లు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. బుధవారం వినాయక చవితి సందర్భంగా సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతానికి చెందిన ఒక పూజ మండపం వద్ద కొందరు కుర్రాళ్లు ఏవో స్టంట్లు చేసేందుకు ప్రయత్నించారు.
Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దీనిలో భాగంగా ఒక యువకుడు నోటిలో ఒక ద్రవాన్ని పోసుకుని, అది గాలిలోకి ఊదుతూ, దాని ద్వారా నోటి నుంచి మంటలు పుట్టించాలనుకున్నాడు. అలా నోటి నుంచి ద్రవాన్ని ఊది, మంట వెలిగించాడు. అయితే క్షణాల్లో ఆ మంట అతడి ఒళ్లంతా అంటుకుంది. అంతే పక్కనున్న వాళ్లంతా దూరంగా వెళ్లిపోయారు. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆ కుర్రాడు వేగంగా తన టీ షర్ట్ తొలగించాడు.
దీంతో టీషర్ట్‌కు అంటుకున్న మంటల ద్వారా ఒళ్లు కాలిపోకుండా జాగ్రత్తపడ్డాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీన్ని అక్కడున్న వారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration.
#ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC
— oursuratcity (@oursuratcity) August 31, 2022
