Nirmala Sitharaman: ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచారు.. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.

Nirmala Sitharaman: ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచారు.. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

Nirmala Sitharaman: తెలంగాణలో ప్రాజెక్టుల వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా పెంచిందని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. కామారెడ్డిలో గురువారం జరిగిన ఒక సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Revanth Reddy: జవాన్ల మరణాలను రాజకీయాలకు వాడుకుంటున్న కేసీఆర్: లేఖలో విమర్శించిన రేవంత్ రెడ్డి

‘‘రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలయ్యారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. కాళేశ్వరం పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్లు అయితే, రూ.1,20,000 కోట్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రాల అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. ఎఫ్ఆర్‌బీఎమ్ పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది. తెలంగాణలో పుట్టే ప్రతి శిశువుపై రూ.1.25 లక్షల అప్పు ఉంది.

Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రం ఇచ్చే పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు రూ.20 వేల కోట్లు ఇచ్చాం. అప్పులపై కేంద్రం కోతలు పెడుతుంది అనేది అబద్ధం. బడ్జెట్లో పెట్టకుండా అప్పులు ఎలా తీసుకొస్తారు? ఇష్టానుసారంగా అప్పులు చేస్తే కేంద్రం అడగకూడదా? నితీష్ కుమార్ కూడా కేసీఆర్ మాటలు వినలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి దేశంలో తిరగండి’’ అని నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యానించారు.