Revanth Reddy: జవాన్ల మరణాలను రాజకీయాలకు వాడుకుంటున్న కేసీఆర్: లేఖలో విమర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జవాన్ల మరణాలను కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో విమర్శించారు.

Revanth Reddy: జవాన్ల మరణాలను రాజకీయాలకు వాడుకుంటున్న కేసీఆర్: లేఖలో విమర్శించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: జవాన్ల మరణాలను తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో అమర జవాన్ల కుటుంబాలు కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

బుధవారం కేసీఆర్ బిహార్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్ తీరును విమర్శించారు. ‘‘బిహార్ పర్యటనలో అమరజవాన్లకు ఆర్థిక సాయం చేయాలనే ఆకాంక్షకంటే, రాజకీయ విస్తరణ కాంక్షే కేసీఆర్‌లో కనిపించింది. జవాన్ల మరణాలను కేసీఆర్ స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును దేశమంతా పంచుతున్నారు. తెలంగాణలో అమరుడైన జవాన్ యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

Arvind Kejriwal: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కారు.. గుజరాత్‌లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్న సీఎం

యాదయ్య కుటుంబానికి ఐదెకరాల పొలం, ఇంటి స్థలం, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కూడా అమర జవాన్ యాదయ్య గురించి ప్రస్తావించారు. మహబూబ్ నగర్ జిల్లా, కొండారెడ్డి పల్లికి చెందిన యాదయ్య కుటుంబాన్ని కేసీఆర్ యాది మరిచారని రేవంత్ విమర్శించారు.