Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

అలెక్సా డివైజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ పేరును ఒక చిన్నారికి పెట్టారు పేరెంట్స్. దీంతో ఆ చిన్నారిని తోటి పిల్లలు ఏడిపిస్తున్నారు. ‘హే అలెక్సా’ అంటూ రకరకాల కామెంట్స్‌తో వేధిస్తున్నారు.

Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

Hey Alexa: కొన్ని పేర్లు ఉన్నవాళ్లను తోటి పిల్లలు అప్పుడప్పుడూ వెక్కిరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. తాజాగా ‘అలెక్సా’ పేరు కలిగినందుకు ఒక చిన్నారిని ఏడిపిస్తున్నారు తోటి పిల్లలు. దీంతో తన పేరు మార్చాలని డిసైడయ్యారు పేరెంట్స్. అమెజాన్ రూపొందించిన అలెక్సా గురించి అందరికీ తెలిసిందే.

Chiranjeevi : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన మెగాస్టార్.. హీరోల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు..

ఇది వాయిస్ కంట్రోల్ డివైజ్. దీనికి యూజర్లు ‘హే అలెక్సా’ అంటూ వాయిస్ ద్వారా ఇచ్చే కమాండ్‌ను అది ఫాలో అవుతుంది. తాజాగా అలెక్సా అని పేరు కలిగి ఉన్న ఒక చిన్నారిని తోటి పిల్లలు వేధిస్తున్నారు. జర్మనీలోని గాట్టింగెన్ ప్రాంతానికి చెందిన ఒక ఆరేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు అలెక్సా అని పేరు పెట్టారు. అయితే, తన స్కూల్‌లో అలెక్సాను.. ‘హే అలెక్సా’ అంటూ రకరకాల పనులు చెప్తూ వేధిస్తున్నారు. తను గ్రౌండ్లో ఆడుకుంటున్నా, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నా.. ఎక్కడున్నా మిగతా పిల్లలంతా ‘హే అలెక్సా’ అని తనకు పనులు చెప్తూ హేళన చేస్తున్నారు. ‘హే అలెక్సా డాన్స్ ఫర్ మి’, ‘హే అలెక్సా సింగ్ ఫర్ మి’ అంటూ వేధిస్తున్నారు.

Megastar Chiranjeevi : చిన్న సినిమాల ఈవెంట్స్ కి వెళ్తే నా స్థాయి తగ్గుతుంది అంటారు.. కానీ..

దీంతో విసుగొచ్చిన పేరెంట్స్, అలెక్సా పేరు ఉంటే ఎప్పటికీ ఇబ్బందే అని భావించారు. దీంతో తన పేరు మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అధికారులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే, పేరు మార్చేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. తన పేరు వల్ల ఆ చిన్నారి మానసికంగా బాగా కుంగిపోతోందని భావించిన కోర్టు.. పేరు మార్పునకు అంగీకరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కొత్త పేరు పెట్టేందుకు నిర్ణయించారు. అయితే, కొత్త పేరేంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.