Megastar Chiranjeevi : చిన్న సినిమాల ఈవెంట్స్ కి వెళ్తే నా స్థాయి తగ్గుతుంది అంటారు.. కానీ..
ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ముఖ్యకారణం ఏడిద నాగేశ్వరరావు గారు. వారితో నా కున్న అనుబంధం సినిమాయేతర సంబంధం. వారికి నేను కుటుంబసభ్యుడిలా................

Megastar Chiranjeevi Speech in First Day First Show Pre Release Event
Megastar Chiranjeevi : జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ అందించిన కథతో కొత్త దర్శకుడు వంశీ, లక్ష్మి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాని గతంలో ఎన్నో క్లాసిక్ సినిమాలు నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మిస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరగగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ముఖ్యకారణం ఏడిద నాగేశ్వరరావు గారు. వారితో నా కున్న అనుబంధం సినిమాయేతర సంబంధం. వారికి నేను కుటుంబసభ్యుడిలా ఉండేవాడిని. వారితో మూడు సినిమాలు చేశాను. ఆయన ప్రపంచంలో తెలుగు వారు గర్వించదగిన సినిమాలు తీశారు. శంకరాభరణం, స్వాతిముత్యం,స్వయంకృషి లాంటి ఎన్నో మంచి సినిమాలు తీశారు. సినిమా పరిశ్రమ గొప్ప పరిశ్రమ. నేను ఈ సినీ పరిశ్రమలోనే ఎక్కవగా ఉన్నాను. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇక్కడకే వచ్చాను. నేను ఈ పరిశ్రమలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఒక ఫైర్ తో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ నిలదొక్కుకుంటారు.”
”అనుదీప్ సినిమా జాతిరత్నాలు చూస్తే అందులో చిట్టి అనే పాట వింటుంటే నా భార్య సురేఖ గుర్తొస్తుంది. నేను సురేఖని చిట్టి అనే పిలుస్తాను. ఆ పాట వచ్చినప్పుడల్లా సురేఖని అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తూ ఉంటాను. చాలా మంది నన్ను చిన్న సినిమాల ఈవెంట్స్ కి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి వెళ్లొద్దంటారు. చిన్న ఈవెంట్స్ కి వెళ్తే నా స్థాయి తగ్గిపోతుంది అంటారు. కానీ నేను వెళితే వాళ్ళకి ఉపయోగపడతాను. నా పేరు వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. అందుకే చిన్న ఈవెంట్స్ కి పిలిస్తే కచ్చితంగా వస్తాను.”
Mrunal Thakur In For NTR 30: తారక రాముడి కోసం కదలివస్తున్న సీతా..?
”నేను ఈ పరిశ్రమలోకి ఆడవాళ్ళు రావాలని కోరుకుంటాను. మా ఫ్యామిలీ నుంచి కూడా లేడీస్ ఈ పరిశ్రమలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఆడవాళ్ళకు ఎంతో గౌరవం ఉంది. అందరూ ఎంతో గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. థియేటర్స్ కు ఎవరూ రావడం లేదు అని అంతా అనుకుంటున్నారు. సరైన కంటెంట్ ఇస్తే ప్రజలు తప్పకుండా థియేటర్లకు వస్తారు. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 మంచి కంటెంట్ తో వచ్చి హిట్ అయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్స్ ప్రేక్షకులకు ఏది అవసరం అనేది చూసి కథల మీద దృష్టి పెట్టాలి. డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని, డేట్స్ ఉన్నాయని కంగారు కంగారుగా గా షూటింగ్స్ చెయ్యొద్దు. డైరెక్టర్ అనే వాడు కథల మీద దృష్టి పెట్టాలి.”
”నెల్లూరులో నేను 7, 8 క్లాస్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి రాము సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాము. ఆ సినిమాకి టిక్కెట్స్ తీసుకొనే క్రమంలో మా నాగబాబుకి ఊపిరి ఆగిపోయేంత పని అయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడటం అనేది ఒక మంచి అనుభూతి. మీ అందరి సమక్షంలో మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని తెలిపారు. ఇలా చిరంజీవి సినిమాలు, డైరెక్టర్స్ మీద మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.