Mrunal Thakur In For NTR 30: తారక రాముడి కోసం కదలివస్తున్న సీతా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా వేట కొనసాగిస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Mrunal Thakur In For NTR 30: తారక రాముడి కోసం కదలివస్తున్న సీతా..?

Mrunal Thakur In For NTR 30 Movie

Updated On : August 31, 2022 / 5:27 PM IST

Mrunal Thakur In For NTR 30 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా వేట కొనసాగిస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకోవాలని చూసినా, ఆమె పెళ్లి చేసుకోవడం, ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉండటంతో, ఆమె స్థానంలో వేరొక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్‌లో ‘సీతా రామం’ మూవీతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఇప్పుడు టాలీవుడ్‌‌లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది.

NTR30 Movie: మరింత ఆలస్యంగా ఎన్టీఆర్-కొరటాల మూవీ.. ఎందుకంటే?

దీంతో కొరటాల శివ కూడా ఈ అమ్మడిని తారక్ కోసం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడట. మృణాల్ పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే తారక్ లాంటి టాప్ పర్ఫార్మర్‌తో మృణాల్ నటిస్తే ఎలా ఉంటుందా అని కొరటాల ఆలోచిస్తున్నాడట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్-మృణాల్ కాంబినేషన్‌పై గుసగుసలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి.