Chiranjeevi : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన మెగాస్టార్.. హీరోల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు..

చిరంజీవి ఈ ఈవెంట్లో సినిమా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ''ఇటీవల జనాలు థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు.........

Chiranjeevi : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన మెగాస్టార్.. హీరోల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు..

Chiranjeevi speech in First Day First Show Movie Pre Release Event

Chiranjeevi :  ఇటీవల తెలుగు సినిమాలు కూడా వరుస ఫ్లాపులు చూశాయి. ఆ ఫ్లాపులు ఏ లోపం వల్ల వచ్చాయో తెలీదు కానీ ఫ్లాప్ వస్తే మాత్రం అది డైరెక్టర్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దీంతో సినిమా ఫ్లాప్ అయితే అంతా డైరెక్టర్స్ నే అంటారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఓ సినీ ఈవెంట్లో డైరెక్టర్స్ పై కామెంట్స్ చేశారు. ఇండైరెక్ట్ గా డైరెక్టర్స్ కి క్లాస్ పీకారు. తాజాగా మరోసారి చిరంజీవి డైరెక్టర్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు.

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ అందించిన కథతో కొత్త దర్శకుడు వంశీ, లక్ష్మి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాని గతంలో ఎన్నో క్లాసిక్ సినిమాలు నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మిస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరగగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

చిరంజీవి ఈ ఈవెంట్లో సినిమా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ”ఇటీవల జనాలు థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు. ఇటీవల మంచి కంటెంట్ తో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ సినిమాలు మంచి హిట్ సాధించాయి. కంటెంట్‌ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు సినిమాకి వస్తారు. లేకపోతే రెండో రోజే సినిమా పోతుంది. ఆ విషయంలో నేనూ బాధితుణ్నే. నాకు కూడా ఫ్లాప్స్ వచ్చాయి.”

Megastar Chiranjeevi : చిన్న సినిమాల ఈవెంట్స్ కి వెళ్తే నా స్థాయి తగ్గుతుంది అంటారు.. కానీ..

”ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కథల మీద దృష్టి పెట్టాలి. ఒక సినిమా ఎందుకు హిట్‌ అయింది, ఎందుకు ఫ్లాప్‌ అయింది అని ఆలోచించాలి. డైరెక్టర్లే సినిమాకి కెప్టెన్స్. ఒక సినిమా కథ రాసేటప్పుడు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించండి. డబ్బులు పెట్టి ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆలోచించండి. హీరోలు, ఆర్టిస్టుల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు. ఛాన్స్ వచ్చింది కదా, ఏదోలా సినిమా తీసేద్దాం అనే ఆలోచన వద్దు. డైరెక్టర్స్ జాగ్రత్తగా కథలు రాస్తే, ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలు రాస్తే హిట్స్ అవే వస్తాయి. మీరు కథ మీద, కంటెంట్ మీద దృష్టి పెట్టండి” అని అన్నారు. ఇటీవల చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి చిరంజీవి డైరెక్టర్స్ పై ఇలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.