Arvind Kejriwal: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కారు.. గుజరాత్‌లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్న సీఎం

ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆయన పార్టీ 58 ఓట్లు సాధించింది.

Arvind Kejriwal: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కారు.. గుజరాత్‌లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్న సీఎం

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో ఆప్ ప్రభుత్వం 58 ఓట్లు సాధించింది.

Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

దీంతో ఆప్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విశ్వాస పరీక్షను సీఎం కేజ్రీవాలే ప్రవేశపెట్టడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఇటీవల ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని ఆప్ నేతలు చెప్పారు. దీంతో బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాలే నేరుగా తనకున్న మెజారిటీని నిరూపించుకోవాలనుకున్నారు. దీనికోసం ఆయనే విశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పరీక్షలో కేజ్రీవాల్ విజయం సాధించారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు.

Chiranjeevi : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన మెగాస్టార్.. హీరోల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు..

‘‘మా పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు 58 ఓట్లు వచ్చాయి. ఒకరు జైల్లో ఉన్నారు. మరో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మిగిలిన ఒకరు స్పీకర్. ప్రతి ఎమ్మెల్యే మాతోనే ఉన్నారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల మనీష్ సిసోడియాపై ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో తమ పార్టీకి గుజరాత్ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరిగిందని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో 2 శాతం ఓట్లు అదనంగా వస్తాయన్నారు.