భార్యపై అనుమానం : కాలు, చేయి నరికివేశాడు

భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. కాపురంలో అనుమానం అనే రాకాసి ప్రవేశించడంతో అతను విచక్షణా కోల్పోయాడు.

Suspecting

Wife’s Hand, Leg : భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. కాపురంలో అనుమానం అనే రాకాసి ప్రవేశించడంతో అతను విచక్షణా కోల్పోయాడు. భార్యపై అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. క్షణికావేశంలో భార్య చేయి, కాలు నరికివేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హోషంగాబాద్ లోని సియోని మాల్వా ప్రాంతానికి చెందిన ప్రీతం సింగ్ కు సంగీత మహిళతో 2012లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఏడేళ్లుగా వీరి కాపురం ఆనందంగా కొనసాగుతోంది. సంగీత ఇండోర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ప్రీతం సింగ్ కుమారుడితో కలిసి నిష్తాపూర్ ప్రాంతంలోని పరాస్ నగర్ లో నివశిస్తున్నాడు. ఇతను దినసర కూలి. అనోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం ప్రవేశించింది. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సెలవు మీద ఇటీవలే సంగీత భోపాల్ కు వచ్చింది.

కుమారుడితో కలిసి ఉంది. బిడ్డతో కలిసి నిద్ర పోతున్న సమయంలో..ప్రీతం సింగ్ గొడ్డలితో వచ్చి..సంగీత కుడి చేయి, కాలు నరికివేశాడు. ఈ దారుణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సంగీతను ఆసుపత్రికి తరలించారు. కాలు, చేయి భాగాలను ఆసుపత్రికి పంపించారు. ఆ సమయంలో ప్రీతం సింగ్ మద్యం మత్తులో ఉన్నట్లు, అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులను బెదిరించినట్లు సమాచారం. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని, సంగీతను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.