Man Hammers Mother-in-Law: బావమరిదికి సపోర్ట్ చేస్తుందనే కోపంతో అత్తను సుత్తితో కొట్టి
గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన దారుణంలో అత్తను సుత్తితో కొట్టి చంపాడో వ్యక్తి. బావమరిదికి సపోర్ట్ చేస్తుందనే కోపంతో ఆవేశంలో దుశ్చర్యకు పాల్పడి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి....

Hammered
Man Hammers Mother-in-Law: గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన దారుణంలో అత్తను సుత్తితో కొట్టి చంపాడో వ్యక్తి. బావమరిదికి సపోర్ట్ చేస్తుందనే కోపంతో ఆవేశంలో దుశ్చర్యకు పాల్పడి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
వడోదరాలోని మంజల్పూర్ ఏరియాలో కళ్యాణ్ బాగ్ సొసైటీలో ఉండే అమీన్.. సవితా పటేల్ అత్తను సుత్తితో చావబాది మంజల్పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరాన్ని ఒప్పుకున్నాడు. అమీన్ భార్య రింకూకు విషయం చెప్పడంతో నేరుగా పుట్టింటికి వెళ్లిన వంటగదిలో పడి ఉన్న తల్లి శవం కనిపించింది. హత్యాయుధమైన సుత్తి సింకులో ఉందని గమనించి.. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
రాహుల్ పటేల్ అనే తన సోదరుడు చేస్తున్న పనికి తన భర్త అమీన్ పదేపదే పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందని కంప్లైంట్ లో పేర్కొంది. లిక్కర్ వ్యాపారం చేయొద్దని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ విషయంపై అత్తా అల్లుళ్ల మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిపింది.
rEAD aLSO: సోకులారబోతతో చెమటలు పట్టిస్తున్న సోనాల్..
రాహుల్ చేసే ప్రతి పనికి సపోర్ట్ చేస్తుండేది కాబట్టి ఇది అలాంటి ఆవేశంలోనే జరిగి ఉండొచ్చని పోలీసులకు చెప్పింది రింకూ. పోలీసులు మృతురాలి కూతురు రింకూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.