Delhi Murder: రూ.1500 కోసం గొడవపడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్
గుర్‌గావ్‌లోని సర్హౌల్ ప్రాంతంలో రూ.1500 కోసం ఫ్రెండ్‌తో గొడవపడి హత్యకు పాల్పడ్డాడు 30ఏళ్ల ఫ్రెండ్. మహీంద్రా అలియాస్ చోటు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Subhan Ali Shaik
- Published On : July 28, 2022 / 12:15 PM IST
Dead Body
Delhi Murder: గుర్‌గావ్‌లోని సర్హౌల్ ప్రాంతంలో రూ.1500 కోసం ఫ్రెండ్‌తో గొడవపడి హత్యకు పాల్పడ్డాడు 30ఏళ్ల ఫ్రెండ్. మహీంద్రా అలియాస్ చోటు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్రైమ్ డిపార్ట్‌మెంట్ (ఏసీపీ) అయిన ప్రీత్ పాల్ మాట్లాడుతూ.. ” నిందితుడిపై విచారణ జరుగుతుంది. కొంతకాలం క్రితం బాధితుడు రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. జులై 20న మధ్యాహ్నం ఇద్దరూ మద్యం తాగారు. తన అప్పు తిరిగివ్వాలని అడగ్గా వాదన మొదలైంది. అలా గొడవ పెరిగి దిండుతో మొహంపై నొక్కి శ్వాస అందకుండా చేసి పరారయ్యాడు” అని తెలిపారు.
అరెస్టును తప్పించుకునేందుకు నిందితుడు తన స్వగ్రామానికి పరారయ్యాడు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తుండగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. హత్య చేయడానికి ఉపయోగించిన దిండును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడి హత్య
జులై 20న తమకు గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అందింది. అతని ఛాతిపై, మెడ, చేతుల మీద గాయలైనట్లు గమనించారు.
సివిల్ హాస్పిటల్ కు తీసుకెళ్లిన పోలీసులు ఆ వ్యక్తి చనిపోయినట్లునిర్ధారించుకున్నారు. అదే రోజు సాయంత్రం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మృతుడి సోదరుడు అవ్‌దేశ్ 27ను కలిశారు. పోస్టుమార్టం నిర్వహించి సెక్షన్ 302(మర్డర్) కింద స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
