Wife Killed: అన్నం వడ్డించలేదని భార్యను చంపి శవం పక్కనే నిద్రపోయిన భర్త
భార్యాభర్తలు ఫుల్లుగా తాగి గొడవ పెట్టుకున్నారు. ఇంతలో తనకు అన్నం వడ్డించాలని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై దాడి చేసి హతమార్చడంతో పాటు రాత్రంతా శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు.
- Subhan Ali Shaik
- Published On : June 19, 2022 / 06:56 AM IST
Murder
Wife Killed: భార్యాభర్తలు ఫుల్లుగా తాగి గొడవ పెట్టుకున్నారు. ఇంతలో తనకు అన్నం వడ్డించాలని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై దాడి చేసి హతమార్చడంతో పాటు రాత్రంతా శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయానికి తానే భార్యను హత్య చేసినట్లు రియలైజ్ అయ్యాడు.
ఇంట్లో ఉన్న రూ.40వేల డబ్బు తీసుకుని పరారీ అవుతుండగా… ఢిల్లీ పోలీసులు మరో బ్రాంచ్ పోలీసుల సహాయంతో ట్రేస్ చేసి అరెస్ట్ చేయగలిగారు. నిందితుడ్ని సుల్తాన్ పూర్ లో ఉండే వినోద్ కుమార్ దూబెగా గుర్తించారు.
శుక్రవారం ఉదయం 9గంటల 20నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో భార్యను దిండుతో నొక్కి చంపేశాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. విచారణ జరిపిన పోలీసులు ప్రాంతంలో ఎంక్వైరీ చేసి అతని వద్ద నుంచి రూ.43వేల 280 డబ్బును, రెండు మందు బాటిల్స్, రక్తపు మరకలు అంటిన దిండు స్వాధీనం చేసుకున్నారు.
Read Also :పెళ్ళి చేయట్లేదని తండ్రిని హత్య చేసిన కొడుకు
2008లో వివాహం చేసుకున్న వినోద్ కుమార్ దూబె అతని భార్య సోనాలి కలిసి ఆల్కహాల్ తీసుకున్నారు. గురువారం రాత్రి బాగా తాగిన తర్వాత ఆహారం తీసుకురావాల్సిందిగా భార్యను ఆదేశించాడు. ఆ విషయంలో ఇద్దరికీ గొడవ జరగడంతో భార్య అతణ్ని చెంపదెబ్బ కొట్టింది. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెను హతమార్చాడు. పోలీసులకు భయపడి డబ్బు తీసుకుని పరారీ అవుతుండగా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
