Marraige :పెళ్ళి చేయట్లేదని తండ్రిని హత్య చేసిన కొడుకు

తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.

Marraige :పెళ్ళి చేయట్లేదని తండ్రిని హత్య చేసిన కొడుకు

marriage )

Marriage : తండ్రి తనకు పెళ్ళి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి… ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.

అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు అన్వేష్   ఏ ఉద్యోగము చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.  తనకు పెళ్ళి  చేయమని తండ్రితో ప్రతి రొజు గొడవ పడుతూ ఉండేవాడు.  ఈ క్రమంలో సోమవారం తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది.  ఈ ఘర్షణలో  కోపోద్రిక్తుడైన   అన్వేష్ సమీపంలో  ఉన్న కొడవలి తీసుకుని తండ్రి మెడపై వేటు వేసి హత్య చేశాడు.  మృతుడి  అల్లుడి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : bjp: రాణి రుద్రమ, దరువు ఎల్లన్న‌ అరెస్ట్.. బండి సంజ‌య్‌కి నోటీసులు