India And Pak : చిన్న పొరపాటు…29 ఏళ్లు జైలులో ఉన్నాడు..చివరకు

మక్వాల్‌కు చెందిన కుల్దీప్ సింగ్ 1992 డిసెంబర్‌లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి.. పాకిస్తాన్‌లోకి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడి సైన్యం అతడిని అరెస్టు చేసింది

Pak Man

J&K Man Returns : చిన్న పొర‌పాటు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. అనుకుండా ఓ రోజు దేశ స‌రిహ‌ద్దు దాటాడు ఆ వ్యక్తి. దీంతో ఊహించిన కష్టాల్లో ప‌డ్డాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లు జైలులో మ‌గ్గాడు. నిత్యం న‌ర‌కం అనుభ‌వించాడు. ఎట్టకేలకు స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ పరిస్థితి జమ్ముకశ్మీర్‌ కథువాలోని ముక్వాల్ నివాసి​కుల్‌దీప్​సింగ్‌కు ఎదురైంది.

Read More : Omicron AP : ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

మక్వాల్‌కు చెందిన కుల్దీప్ సింగ్ 1992 డిసెంబర్‌లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి.. పాకిస్తాన్‌లోకి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడి సైన్యం అతడిని అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆయ‌న గూఢచారి కేసులో విచారణ పేరిట నాలుగు ఏళ్ల పాటు తిప్పింది. ఆ తర్వాత కఠిన కారాగా శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కోట్​లఖ్‌పత్​ జైల్లో 29 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

Read More : Delhi : ఢిల్లీలో కొత్త రూల్స్… ప్రయాణీకుల అవస్థలు..2 కి.మీటర్ల క్యూ లైన్‌‌లు

ఉత్తర ప్రత్యుత్తరాలు, భారత హైకమిషన్ న్యాయ పోరాటం తర్వాత, సింగ్ జైలు నుంచి విడుదలై అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆయ‌న రాకతో..వారి కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. కుటుంబంతో మళ్లీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు కుల్‌దీప్‌. పాక్ ఆర్మీ వలలో చిక్కిన ప్రతి భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తున్నారని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. తనను కూడా బాగా ఇబ్బందిపెట్టారని తెలిపాడు.